ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ : మోదీ ఫొటోలున్న రైలు టిక్కెట్లు రద్దు

| Edited By: Pardhasaradhi Peri

Mar 21, 2019 | 2:15 PM

న్యూఢిల్లీ : ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రధాని మోదీ ఫోటోతో ఉన్న టికెట్లను రద్దుచేసింది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో ముద్రితమైన రైల్వే టిక్కెట్ల వినియోగాన్ని బుధవారం రైల్వే శాఖ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దేశంలోని 17 జోన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ టిక్కెట్ల వ్యవహారంపై ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనందున నిబంధనావళికి […]

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ : మోదీ ఫొటోలున్న రైలు టిక్కెట్లు రద్దు
Follow us on

న్యూఢిల్లీ : ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రధాని మోదీ ఫోటోతో ఉన్న టికెట్లను రద్దుచేసింది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో ముద్రితమైన రైల్వే టిక్కెట్ల వినియోగాన్ని బుధవారం రైల్వే శాఖ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దేశంలోని 17 జోన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ టిక్కెట్ల వ్యవహారంపై ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనందున నిబంధనావళికి విరుద్ధమని, ఇది ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈసీ నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రానప్పటికీ తమంతట తాముగా ఈ టిక్కెట్ల వినియోగాన్ని ఆపేస్తున్నామని స్పష్టం చేసింది. గతంలో దాదాపు లక్ష టిక్కెట్లను ముద్రించగా… వాటిల్లో కొద్ది సంఖ్యలో మాత్రమే మిగిలాయని పేర్కొంది. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మంత్రిత్వ శాఖ ప్రచారంలో భాగంగా ఈ టిక్కెట్ల వెనుకభాగంలో కొంతమేర మోదీ ఫోటోను ముద్రించారు.