ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఫీజు ఎత్తివేస్తాం- రాహుల్ గాంధీ

|

Apr 08, 2019 | 8:13 PM

ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు అప్లికేషన్ ఫీజులు రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం ప్రకటించారు. ఎన్నికల్లో యూత్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్న కాంగ్రెస్…వారిని ఆకట్టుకునే దిశగా  ఇటువంటి పథకాలను ప్రకటిస్తూ వస్తుంది. మరోవైపు నిరుద్యోగులు, పేదలను ఆకర్షించేలా మేనిఫెస్టోను రూపొంచింది. న్యాయ పథకం కింద పేదలకు నెలకు రూ. 6 వేల చొప్పున ఏడాదికి రూ. 72వేలు ఆర్థిక సాయం అందిస్తామని  ప్రకటించింది. అంతేగాక […]

ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఫీజు ఎత్తివేస్తాం- రాహుల్ గాంధీ
Follow us on

ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు అప్లికేషన్ ఫీజులు రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం ప్రకటించారు. ఎన్నికల్లో యూత్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్న కాంగ్రెస్…వారిని ఆకట్టుకునే దిశగా  ఇటువంటి పథకాలను ప్రకటిస్తూ వస్తుంది. మరోవైపు నిరుద్యోగులు, పేదలను ఆకర్షించేలా మేనిఫెస్టోను రూపొంచింది. న్యాయ పథకం కింద పేదలకు నెలకు రూ. 6 వేల చొప్పున ఏడాదికి రూ. 72వేలు ఆర్థిక సాయం అందిస్తామని  ప్రకటించింది. అంతేగాక ప్రస్తుతం ఖాళీగా ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఉపాధి హామీ కింద ఉన్న పనిదినాలు కూడా 150 రోజులకు పెంచుతామని హామీ ఇచ్చింది.