
హైదరాబాద్: ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. చంద్రబాబు, జగన్‌లు తమదైన శైలిలో దూసుకెళుతున్నారు. ఏపీలో ఎవరు గెలుస్తారనే అంశంపై ఇటు తెలంగాణ ప్రజానీకంతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆసక్తికరమైన అంశంగా మారింది. జాతీయ మీడియా సైతం ఈసారి ఏపీపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో అసలు ఏపీలో ఎవరు గెలుస్తారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అడగ్గా విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున మాల్కజ్‌గిరి నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎవరు గెలుస్తారో నేను చెప్పలేను. ఏపీ రాజకీయాలపట్ల నాకు ఆసక్తి లేదు. పక్క రాష్ట్ర రాజకీయాల గురించి నాకు తెలియదు అని అన్నారు.