ప్రత్తిపాడులో జనసేనకు షాక్

విజయవాడ: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి సాయికుమార్ యాదవ్ జనసేనకు రాజీనామా చేశారు. ప్రత్తిపాడు టికెట్ ఆశించిన ఆయనకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడంలేదని తెలుసుకున్న సాయికుమార్ మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయికుమార్‌ను టీడీపీ సంప్రదించి చర్చలు జరిపింది. తగిన ప్రాధాన్యత పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో సాయికుమార్ గురువారం ఉదయం 2,000 మంది అనుచరులు, మద్దతుదారులతో కలిసి […]

ప్రత్తిపాడులో జనసేనకు షాక్

Updated on: Mar 21, 2019 | 2:15 PM

విజయవాడ: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి సాయికుమార్ యాదవ్ జనసేనకు రాజీనామా చేశారు. ప్రత్తిపాడు టికెట్ ఆశించిన ఆయనకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడంలేదని తెలుసుకున్న సాయికుమార్ మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సాయికుమార్‌ను టీడీపీ సంప్రదించి చర్చలు జరిపింది. తగిన ప్రాధాన్యత పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో సాయికుమార్ గురువారం ఉదయం 2,000 మంది అనుచరులు, మద్దతుదారులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ ఏడాది జనవరి 23న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కలిసి సాయికుమార్ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.