వారణాసిలో 24 మంది పసుపు రైతుల నామినేషన్ల తిరస్కరణ

| Edited By:

May 03, 2019 | 5:56 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యలో వారణాసిలో ప్రధాని మోదీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. నామినేషన్ల స్క్రూటినీలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్‌ ను మాత్రమే ఆమోదించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే నామినేషన్లు తిరస్కరించారని ఆరోపించారు. రైతులు నామినేషన్లు వెయ్యటానికి అడుగడుగునా ఇబ్బందులు సృష్టించిన అధికారులు నామినేషన్లను కావాలనే తిరస్కరించారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై తెలంగాణ […]

వారణాసిలో 24 మంది పసుపు రైతుల నామినేషన్ల తిరస్కరణ
Follow us on

సార్వత్రిక ఎన్నికల నేపథ్యలో వారణాసిలో ప్రధాని మోదీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. నామినేషన్ల స్క్రూటినీలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్‌ ను మాత్రమే ఆమోదించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే నామినేషన్లు తిరస్కరించారని ఆరోపించారు. రైతులు నామినేషన్లు వెయ్యటానికి అడుగడుగునా ఇబ్బందులు సృష్టించిన అధికారులు నామినేషన్లను కావాలనే తిరస్కరించారని వారు ఆరోపిస్తున్నారు.

దీనిపై తెలంగాణ పసుపు రైతుల సంఘం నేతలు ఢిల్లీకి వెళ్లి వారణాసి అధికారులపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. వారణాసిలో మోదీతో పాటు 119 మంది నామినేషన్లు వేయగా వివిధ కారణాలతో 89 మంది నామినేషన్లను తిరస్కరించారు. ప్రస్తుతం వారణాసి లోక్ సభ బరిలో ప్రధాని మోదీతో సహా 30మంది మాత్రమే ఉన్నారు. మొత్తం 25 మంది రైతులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. కాగా వీరిలో 24 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కేవలం ఒకే ఒక్క రైతు ప్రస్తుత ఎన్నికల బరిలో నిలిచారు.