మావోయిస్టుల మందుపాతరలను నిర్వీర్యం చేసిన పోలీసులు.. ముందే పసిగట్టడంతో తప్పిన పెను ప్రమాదం..

|

Feb 25, 2021 | 11:22 AM

మావోయిస్టులను ఏరిపారేసేందుకు పోలీసుల కూంబింగ్‌.. పోలసులను నిలువరించేందుకు మావోయిస్టుల మందుపాతరలు.. అటు ఏవోబీ నుంచి ఇటు దండకారణ్యం వరకు..

మావోయిస్టుల మందుపాతరలను నిర్వీర్యం చేసిన పోలీసులు.. ముందే పసిగట్టడంతో తప్పిన పెను ప్రమాదం..
Follow us on

మావోయిస్టులను ఏరిపారేసేందుకు పోలీసుల కూంబింగ్‌.. పోలసులను నిలువరించేందుకు మావోయిస్టుల మందుపాతరలు.. అటు ఏవోబీ నుంచి ఇటు దండకారణ్యం వరకు వరుస సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఏవోబీలో మావోయిస్టుల మందుపాతర పేలి కూంబింగ్‌ బలగాలకు చెందిన ఓ పోలీస్‌ తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. కాకపోతే మందు పాతరలను ముందే పసిగట్టిన పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు.

మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు వేసిన ప్లాన్ ను విఫలం చేశారు పోలీసులు. కూంబీంగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సి60 కమాండోలను మట్టు పెట్టెందుకు మావోయిస్టులు అమర్చిన ఐఇడి లను పోలీసులు నిర్వీర్యం చేశారు.

ఏటాపల్లి తాలుకా కోకోటి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న పోలీసులను చూసి మావోయిస్టులు వారి స్థావరాలను నుండి పారిపోయారు. సంఘటన స్థలంలో వంట పాత్రలు, బట్టలు, సాహిత్య పుస్తాకాలు ,సామాగ్రీ స్వాధీనపర్చుకున్నారు పోలీసులు. రెండు ఐఇడి మందుపాతరలను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Read more:

రేపు భారత్‌ బంద్‌.. పెట్రోలియం‌ రేట్లు, జీఎస్టీకి నిరసనగా అఖిలభారత వ్యాపార సమాఖ్య పిలుపు