టీటీడీకి రూ.12.65 లక్షల విలువైన ఊరగాయలు విరాళం.. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అందజేత

|

Feb 18, 2021 | 5:06 PM

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశంలోని నలు మూలల నుంచి నిత్యం లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చిన..

టీటీడీకి రూ.12.65 లక్షల విలువైన ఊరగాయలు విరాళం.. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అందజేత
Follow us on

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశంలోని నలు మూలల నుంచి నిత్యం లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చిన భక్తులకు టీటీడీ ఉచితంగా అన్నదానం చేస్తూ ఉంటుంది. ఇందుకోసం శ్రీవారి భక్తులు తమకు తోచినకాడికి విరాళాలు ఇస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన విజయ ఫుడ్ ప్రాడక్ట్స్ అధినేత కె.రాము టిటిడికి రూ.12.65 లక్షలు విలువైన ఊరగాయలు విరాళంగా అందించారు. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం ఈ ఊరగాయలను టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

వీటిలో 7 రకాల 4,500 కిలోల ఊరగాయలు, 300 కిలోల పసుపు పొడి, 200 కిలోల కారం పొడి, 300 కిలోల పులిహోర పేస్ట్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అన్నదానం డిప్యూటీ ఈవో నాగ‌రాజు, క్యాటరింగ్‌ అధికారి జిఎల్‌ఎన్‌.శాస్త్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read more:

ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానిలు ఇవే..