Perni Nani: కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

|

Oct 28, 2021 | 3:59 PM

ఏపీలో పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారంటూ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

Perni Nani: కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
Minister Perni Nani
Follow us on

ఏపీలో పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారంటూ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై ఏపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  కేసీఆర్ పార్టీ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకన్న పేర్ని.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే బెటర్ అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ పెట్టడానికి ముందుగా.. తెలంగాణ కేబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెడితే బాగుంటుందన్నారు పేర్ని నాని. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చని చెప్పారు. ఏపీ, తెలంగాణాలు సమైక్యంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారని చెప్పారు.

ఏపీలో గంజాయి సాగు ఎక్కువగా ఉందని ఇప్పుడు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తమ ప్రభుత్వం ఏర్పాటు కంటే ముందే రాష్ట్రంలో విచ్చలవిడగా గంజాయి సాగులో ఉందన్నారు మంత్రి పేర్నినాని. ఈ విషయాన్ని 2017లో అప్పటి మంత్రి గంటా శ్రీనివాస్ రావు, 2018లో పవన్ కల్యాణ్ చెప్పినట్లు గుర్తు చేశారు. అమ్మ ఒడి పథకంపై ప్రతిపక్షాలు ఆరోపణలు సరికాదన్నారు మంత్రి పేర్ని. టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదన్నారు. నిధులు లేక పథకాన్ని నీరుగారుస్తున్నారన్న వాదన అర్థరహితమన్నారు. విద్యార్థుల 75 శాతం హాజరు అమ్మ ఒడి పథకం జీవోలోనే ఉందంటున్నారు.

Also Read: మిస్టరీ మరణాలు.. చెరువులో దూకి ముగ్గురు యువతుల ఆత్మహత్య

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన