Pegasus Spyware: ఏపీలో పెగాసస్‌ పెను దుమారం.. మమతకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లిందంటున్న టీడీపీ తమ్ముళ్లు

|

Mar 18, 2022 | 1:38 PM

Pegasus Software:పెగాసస్ సై వేర్.! దేశ రాజకీయాల్లో పెను సంచలనం. ఈ ఇష్యూ ఏ రేంజ్‌లో రచ్చ క్రియేట్‌ చేసిందో... చేస్తుందో చుస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే మ్యాటర్‌ బెంగాల్‌ మీదుగా ఏపీని చాలా బలంగా తాకింది.

Pegasus Spyware: ఏపీలో పెగాసస్‌ పెను దుమారం.. మమతకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లిందంటున్న టీడీపీ తమ్ముళ్లు
Pegasus Spyware
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనూ పెగాసస్(Pegasus Spyware) ప్రకంపనలు మొదలయ్యాయి. హైవోల్టేజ్‌ హీట్‌ను రాజేస్తున్నాయి. నిన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. జస్ట్ 25 కోట్లు చెల్లిస్తే.. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ ఇస్తామంటూ తమకు 3ఏళ్ల క్రితమే ఆఫర్‌ వచ్చిందని కానీ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే పెగాసస్‌ను తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. అయితే ఇదే టైమ్‌లో చంద్రబాబు అప్పట్లో ఈ స్పైవేర్ వాడరని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కామెంట్స్‌తో ఏపీలో రచ్చ రాజుకుంది.మమత కామెంట్స్‌ను ఖండించారు నారా లోకేశ్‌. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను గతంలో టీడీపీ ప్రభుత్వం ఉపయోగించిందన్న వార్తల్లో నిజం లేదన్నారు. చట్ట వ్యతిరేక పనులను చంద్రబాబు ఎప్పుడూ అనుమతించరని స్పష్టం చేశారు.

పెగాసస్‌ స్పైవేర్‌ను తాము ఉపయోగిస్తే జగన్ అధికారంలోకే వచ్చేవారా..? అని ప్రశ్నించారు. టీడీపీ తప్పులు వెతకడానికి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీ సహా అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను సీఎం జగన్ తనిఖీలు చేయించారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని మమతా బెనర్జీ నిజంగానే కామెంట్ చేసి ఉంటే.. ఆమెకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లి ఉండొచ్చని లోకేశ్‌ అనుమానం వ్యక్తం చేశారు.

ఇక ఇప్పుడు ఇదే ఇష్యూపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా అప్పటి డీజీపీ సవాంగే చెప్పారంటూ ట్వీట్ చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం కర్నూలు జిల్లాకి చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు.. డీజీపీ ఇచ్చిన సమాధానాన్ని ట్యాక్ చేశారు.

పెగాసస్‌ ఇష్యూ కాస్తా పొలిటికల్ విమర్శలకు దారితీస్తోంది. మా దగ్గర ఆ సాఫ్ట్‌వేర్ ఉంటే అబ్బాయిల గొడ్డలిపోటు నుంచి బాబాయ్ వివేకాని కాపాడేవాళ్లం కదా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.

Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..