ఏడు పదులు దాటిన వృద్ధురాలు.. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్‌.. ప్రజా సేవకు వయసు అడ్డు కాదంటున్న అక్కమ్మ..

|

Feb 13, 2021 | 1:53 PM

ప్రజా సేవ చేసేందుకు సేవ చేయాలనే తపన ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదని చాటుచుతున్నారు ఈ 71 ఏళ్ల వృద్ధురాలు. గ్రామ ప్రజలకు, పుట్టిన ఊరుకు..

ఏడు పదులు దాటిన వృద్ధురాలు.. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్‌.. ప్రజా సేవకు వయసు అడ్డు కాదంటున్న అక్కమ్మ..
Follow us on

ప్రజా సేవ చేసేందుకు సేవ చేయాలనే తపన ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదని చాటుచుతున్నారు ఈ 71 ఏళ్ల వృద్ధురాలు. గ్రామ ప్రజలకు, పుట్టిన ఊరుకు సేవా చేయడానికి వయస్సు తో పనిలేదు అంటుంది ఓ వృద్ధురాలు. ఏడు పదుల వయస్సు లో తన ఊరి ప్రజలకు సేవ చేసుకుంటాను అంటూ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులు రాలుగా నామినేషన్ వేసింది వృద్ధురాలు.

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లిలంక గ్రామపంచాయతిలోని 4 వ వార్డుకు వైస్సార్సీపీ బల పరచిన అభ్యర్థి అత్యంత వృదురాలు చీకురమెల్లి అక్కమ్మ 71 సంవత్సరల వయస్సులో నామినేషన్ దాఖలు చేశారు. సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో తను గ్రామంలోని ప్రజలకు సేవ చేయాలని నామినేషన్ వేశానని అక్కమ అంటున్నారు.

అయితే ఈ వృద్ధురాలు ఎన్నికల్లో పోటీకి ముందుకు రావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదవి లేకపోయినా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే అక్కమ్మ.. గెలుపు ఖాయమంటున్నారు. ఈ వృద్ధురాలిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాలకు దూరంగా ఉంటున్న యువత ముందుకు వచ్చి గ్రామాల్లో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు గ్రామస్థులు

 

Read more:

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు టీడీపీ అధినేత లేఖ.. లేఖలో చంద్రబాబు ఏమని ఫిర్యాదు చేశారంటే..