రాహుల్ గాంధీ ఆస్తులు, అప్పుల వివరాలు!

ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గురువారం కేరళలోని వయనాడ్‌ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వయనాడ్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.14.85 కోట్లు. 2014 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే.. ఆయన ఆస్తులు రూ.4.85 కోట్లు పెరిగాయి. సోనియా గాంధీ నుంచి రాహుల్ రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆయనకు మొత్తం రూ.72 లక్షలకు పైగా అప్పులున్నాయి. ఆయన సొంతంగా సమకూర్చుకున్న ఆస్తుల విలువ రూ.8.75 కోట్లు. ఆయనకు […]

రాహుల్ గాంధీ ఆస్తులు, అప్పుల వివరాలు!

Edited By:

Updated on: Apr 05, 2019 | 9:49 AM

ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గురువారం కేరళలోని వయనాడ్‌ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వయనాడ్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.14.85 కోట్లు. 2014 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే.. ఆయన ఆస్తులు రూ.4.85 కోట్లు పెరిగాయి.

సోనియా గాంధీ నుంచి రాహుల్ రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆయనకు మొత్తం రూ.72 లక్షలకు పైగా అప్పులున్నాయి. ఆయన సొంతంగా సమకూర్చుకున్న ఆస్తుల విలువ రూ.8.75 కోట్లు. ఆయనకు వివిధ బ్యాంకుల్లో రూ.17.93 లక్షలకుపైగా డిపాజిట్లు ఉన్నాయి. రాహుల్‍కు 333 గ్రాముల బంగారంతో సహా రూ.2.91 లక్షల విలువైన ఆభరణాలు కూడా ఉన్నాయి.

గురుగ్రామ్‌‌లోని సిలోఖేరాలో ఆయనకు 5838 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య భవనం ఉంది. దీని విలువ రూ.8.75 కోట్లు. ఢిల్లీలోని మెహ్రౌలిలో తన సోదరి ప్రియాంక గాంధీతో కలిపి రాహుల్‌కు 2.34 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇది ఆయనకు పూర్వీకుల నుంచి సంక్రమించింది.