Nishith Pramanik : మోదీ కేబినెట్‌లో అతి పిన్న వయస్కుడు..! ప్రైమరీ టీచర్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు అతడి ప్రయాణం..

|

Jul 08, 2021 | 12:58 AM

Nishith Pramanik : ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో బెంగాల్‌కు చెందిన నలుగురు ఎంపీలు, శాంతను ఠాకూర్, డాక్టర్ సుభాస్ సర్కార్,

Nishith Pramanik : మోదీ కేబినెట్‌లో అతి పిన్న వయస్కుడు..! ప్రైమరీ టీచర్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు అతడి ప్రయాణం..
Nishith Pramanik
Follow us on

Nishith Pramanik : ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో బెంగాల్‌కు చెందిన నలుగురు ఎంపీలు, శాంతను ఠాకూర్, డాక్టర్ సుభాస్ సర్కార్, జాన్ బార్లా, నిషిత్ ప్రమానిక్‌లకు కేంద్ర సహాయ మంత్రులుగా స్థానం దక్కింది. రాష్ట్రపతి భవన్‌లో పీఎం నరేంద్ర మోదీ సమక్షంలో నిషిత్ ప్రమానిక్ ఆంగ్ల భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని కొత్త ముఖాలు కూడా మంత్రివర్గంలో చేరాయి. వారిలో నిషిత్ ప్రమానిక్ ఒకరు. ఆయన వయస్సు కేవలం 35 సంవత్సరాలు. మోదీ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడు.

2019 లో బెంగాల్‌కు చెందిన కూచ్ బెహర్ సీటు నుంచి నిశిత్ ప్రమానిక్ ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటిసారి బీజేపీ ఎంపీ అయ్యారు. దీనికి ముందు ఆయన టీఎంసీలో ఉన్నారు. ఎన్నికలకు ముందు టీఎంసీని వదిలి బీజేపీలో చేరారు. అతను ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. BCA డిగ్రీ చేశాడు. ఎంపీగా ఉన్న సమయంలో బీజేపీ ఆయనను బెంగాల్ దిన్హాట సీటు నుంచి పోటీ చేయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు కానీ పార్టీ నాయకత్వం సూచనల మేరకు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

నిశిత్ ప్రమానిక్ రాజవంశీ సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపారు. ఆయన కూడా రాజవంశీ సంఘం నుంచి వచ్చినవారే కావడం విశేషం. ఉత్తర బెంగాల్‌లో బీజేపీ విస్తరణ వెనుక నిషిత్ ప్రమానిక్ హస్తం ఉంటుంది. కేవలం 35 ఏళ్ల నిసిత్ ప్రమానిక్ తృణమూల్ కాంగ్రెస్ యువ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే 2018 లో బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీకి వ్యతిరేకంగా సుమారు 300 మంది స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టారు. వీరిలో చాలామంది గెలిచారు.

దీని తరువాత ఆయన ఫిబ్రవరి 2019 లో బీజేపీలో చేరారు. అదే సంవత్సరంలో పార్టీ కూచ్ బెహర్ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికలకు టికెట్ ఇచ్చింది. గతంలో బాబుల్ సుప్రియో, దేవశ్రీ చౌదరి బెంగాల్‌కు చెందిన రాష్ట్ర మంత్రులుగా ఉండేవారు. బాబుల్ సుప్రియో అసన్సోల్ ఎంపీ. కేంద్ర మంత్రుల మండలిలో భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల సహాయ మంత్రిగా ఉన్నారు. దేబాశ్రీ చౌదరి రాయ్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఇద్దరూ మంత్రివర్గం విస్తరణకు ముందే రాజీనామా చేశారు.

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కి టెండర్ల ఆహ్వానం.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Cabinet Expansion 2021: పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి..

Hyderabad: హైదరాబాద్‌లో ఎడతెరపిలేని వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..