Jitendra Awhad: ఎన్సీపీ సీనియర్‌ నేత జితేంద్ర అవద్‌ రాజీనామా.. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి!

|

Nov 15, 2022 | 10:54 AM

నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలవడానికి కారు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా జితేంద్ర అవద్‌ నా భుజాలపై చేయి వేసి పక్కకు తోశాడు. కింద పడిపోయినన్ను కొందరు లేవనెత్తారు..

Jitendra Awhad: ఎన్సీపీ సీనియర్‌ నేత జితేంద్ర అవద్‌ రాజీనామా.. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి!
Molestation case filed against Jitendra Awhad
Follow us on

మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు మాజీ ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌ (59)పై థానే పోలీసులు కేసు నమోద చేశారు. థానే సిటీలో ఆదివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు రిదా రషీద్ తోసేశాడనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. బీజేపీ మహిళా మోర్చా (మహారాష్ట్ర) వైస్ ప్రెసిడెంట్ అయిన రిదా రషీద్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలవడానికి కారు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా జితేంద్ర అవద్‌ నా భుజాలపై చేయి వేసి పక్కకు తోశాడు. కింద పడిపోయినన్ను కొందరు లేవనెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులకు చూపాను. రాజకీయ కుట్రతో ఈ ఫిర్యాదు చేయలేదు. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌ను స్పందించాలని కోరారు. జితేంద్ర అవద్‌ చర్యను మహారాష్ట్ర ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ఇది రాజకీయ ప్రతీకారం తప్ప మరొకటి కాదని విమర్శలు గుప్పించారు.

మరోవైపు పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించారని నిరసన తెలుపుతూ జితేంద్ర అవద్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసుల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. నవంబర్‌ 7న ‘హర్ హర్ మహాదేవ్’ మరాఠీ సినిమా ప్రదర్శనను నిలిపివేసినందుకు జితేంద్రపై థానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది జరిగిన 72 గంటల వ్యవధిలో తనపై వేదింపుల ఆరోపణలపై తనను అరెస్ట్‌ చేయడాన్ని జితేంద్ర తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని చూడలేకపోతున్నానని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్‌కు తన రాజీనామాను అందజేశారు.

ఎన్‌సీజీ నేత అజిత్ పవార్ స్పందిస్తూ రాజకీయ కుట్రతోనే జితేంద్రపై తప్పుడు కేసులు పెట్టారని, వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎం, డీసీఎం స్వయంగా జోక్యం చేసుకోవాలి. జితేంద్ర అవద్‌ను వ్యక్తిగతంగా కలుస్తానని పవార్ అన్నారు. మహారాష్ట్రలోని ముంబ్రా-కల్వా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.