PM Modi: త్వరలో నాసల్‌ వ్యాక్సిన్‌, DNA వ్యాక్సిన్‌ ప్రారంభం : ప్రధాని నరేంద్ర మోడీ..

| Edited By: Shaik Madar Saheb

Dec 26, 2021 | 8:08 AM

PM Narendra Modi: దేశంలో కోవిడ్ -19 మూడో వేవ్ భయాలు, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం

PM Modi: త్వరలో నాసల్‌ వ్యాక్సిన్‌, DNA వ్యాక్సిన్‌ ప్రారంభం : ప్రధాని నరేంద్ర మోడీ..
Nasal Corona Vaccine
Follow us on

PM Narendra Modi: దేశంలో కోవిడ్ -19 మూడో వేవ్ భయాలు, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా నాసల్ వ్యాక్సిన్, ప్రపంచంలోని మొట్టమొదటి DNA కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో పాటు పుకార్లకు దూరంగా ఉండాలని, కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌తో జాగ్రత్తగా ఉండాలని దేశ ప్రజలను అభ్యర్థించారు.నాసికా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ.. ఇది ప్రస్తుతం భారతదేశంలో క్లినికల్ ట్రయల్‌లో ఉంది భారత్ బయోటెక్ దీనిని తయారు చేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయని అయితే DNA వ్యాక్సిన్‌ వేయడానికి మాత్రం సూదులు ఉపయోగించరని వెల్లడించారు.

నాసల్ వ్యాక్సిన్ అంటే ఏమిటి?
ఇది ఒక రకమైన నాసికా ఔషధం. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్నారు కానీ ఇది అలా కాదు ఇది ఒక రకమైన స్ప్రే, ఇది ముక్కులో స్ప్రే చేస్తారు. ముక్కు ద్వారా కరోనావైరస్ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో, అదేవిధంగా ఈ ఔషధం కూడా ముక్కు ద్వారా శరీరంలోకి వెళుతుంది. ఇందులో ఇంజెక్షన్ ఉపయోగించరు. అందుకే నొప్పి కూడా ఉండదు. కండరాలలోకి ఇంజెక్ట్ చేసిన వ్యాక్సిన్‌ను ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ అని పిలుస్తారు. అదే విధంగా ముక్కులో కొన్ని చుక్కలు వేసి ఇచ్చే టీకాను ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అని సాధారణ భాషలో పిలుస్తారు. దీనిని నాసల్ స్ప్రే అంటారు. గతంలో కూడా ఈ రకమైన వ్యాక్సిన్ మార్కెట్‌లో ఉంది. గతంలో చాలా వ్యాధులకు ఈ విధంగా వ్యాక్సిన్‌ వేశారు. ఈ పద్ధతిని జంతువులపై కూడా ఉపయోగిస్తారు.

వ్యాక్సిన్‌ ఇంజక్షన్ ద్వారా ఇవ్వడం వల్ల ఊపిరితిత్తుల దిగువ భాగాన్ని మాత్రమే రక్షిస్తారని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో నాసికా వ్యాక్సిన్ ఎగువ, దిగువ ఊపిరితిత్తులను రెండింటినీ రక్షించగలదు. వైరస్ వ్యాప్తిని కూడా నిరోధించవచ్చు. ఇది స్ప్రే ద్వారా ఇస్తారు. దీనికి ప్రత్యేక పరీక్ష అవసరం లేదు సాధారణ టీకా దుష్ప్రభావాల కంటే చాలా తక్కువ దుష్ప్రభావాలు ఉంటాయి. నాసికా వ్యాక్సిన్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది సిరంజిల అవసరాన్ని తొలగిస్తుంది. ఇది గాయం ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా ఈ టీకాలు వేయడం కూడా సులభం.

PM Modi: ఓమిక్రాన్ సంక్షోభంపై ప్రసంగించిన ప్రధాని మోడీ.. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు..

యాషెస్ సిరీస్ జరుగుతుండగా బాధాకరమైన వార్త.. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మరణించాడు..

Yuvraj singh: అంతరిక్షంలోకి వెళ్లిన యువరాజ్‌ సింగ్‌ బ్యాట్‌.. ఎలాగో తెలుసా..?