లోకే‌శ్‌కు తప్పని ట్రోలింగ్ తిప్పలు!

ఈ మధ్య సోషల్ మీడియాలో పొలిటికల్ వార్స్ పెరిగిపోయాయి. సందు దొరికితే ప్రత్యర్ధులను ట్వీట్లతో, ట్రోలింగ్స్ తో చీల్చి చెండాడుతున్నారు. అయితే పొట్టి పొట్టి మాటలతో ప్రత్యర్ధులకు వణుకు పుట్టించే ఒక నేతకు సోషల్ ఫ్లాట్ ఫామ్ పై చుక్కెదురైంది. సొంత పార్టీ నుంచే ట్రోలింగ్ లు ఫేస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఈ మధ్య సాహో సినిమా స్పందించిన తీరు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. […]

లోకే‌శ్‌కు తప్పని ట్రోలింగ్ తిప్పలు!
Nara Lokesh
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 6:10 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో పొలిటికల్ వార్స్ పెరిగిపోయాయి. సందు దొరికితే ప్రత్యర్ధులను ట్వీట్లతో, ట్రోలింగ్స్ తో చీల్చి చెండాడుతున్నారు. అయితే పొట్టి పొట్టి మాటలతో ప్రత్యర్ధులకు వణుకు పుట్టించే ఒక నేతకు సోషల్ ఫ్లాట్ ఫామ్ పై చుక్కెదురైంది. సొంత పార్టీ నుంచే ట్రోలింగ్ లు ఫేస్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఈ మధ్య సాహో సినిమా స్పందించిన తీరు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ట్రోలింగ్ తో తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు.

సాహో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విజువల్ వండర్ సినిమా అని.. ఆ సినిమా చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, సాహో సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు. ఇది పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నచ్చడం లేదు. దాంతో లోకేష్, బాలకృష్ణ రాజకియాలకు అనర్హులని, వారిద్దరూ పార్టీకి దూరంగా ఉంటే మంచిదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

దానికీ రీజన్ ఉంది మరి.. గతంలో కృష్ణంరాజు చంద్రబాబు నాయుడిని చచ్చిన పాము అని కామెంట్ చేశారని, జగన్ ను ప్రభాస్ పొగిడాడని, ఇది నచ్చని టీడీపీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. దాంతో మన గురించి తప్పుగా మాట్లాడిన వారికి ఎలా సపోర్ట్ చేస్తారని లోకేష్ ను ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీనుంచే కాకుండా సొంతపార్టీ వారే లోకేష్ ను నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.