తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సభకు ఇందూరు ముస్తాబయ్యింది. ఇవాళ సాయంత్రం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగే సభలో పాల్గొంటారు. కేసీఆర్ సభ కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. నిజామాబాద్ సభలోనే కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. అలాగే.. కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు. కాంగ్రెస్‌తో పాటు బీజేపీపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇవాళ జరిగే సభలో కూడా రెండు పార్టీలపై విరుచుకుపడే అవకాశముంది.