మోదీ, అమిత్ షా ‘ చక్రవ్యూహం ‘.. రాహుల్ డీలా

ఈ రాజకీయ చదరంగంలో వ్యూహాలు, ప్రతివ్యూహాలు నేతల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఎవరిది పైచేయి అవుతుందో..ఎవరిది ‘ పాము ‘ బారిన పడి దిగజారుతుందో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా నిర్దేశిస్తారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోదీ, అమిత్ షాల పొలిటికల్ స్ట్రాటజీ ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యూహం బలాదూర్ గా మిగిలిపోయింది. ఆ ఇద్దరి చక్రవ్యూహంలో ఆయన ‘ చిక్కుకుని ‘ విలవిలలాడారు. ఫలితంగా ఘన విజయం మోదీ, షాలను వరించగా.. రాహుల్ […]

మోదీ, అమిత్ షా ' చక్రవ్యూహం '.. రాహుల్ డీలా
Follow us

|

Updated on: May 29, 2019 | 5:50 PM

ఈ రాజకీయ చదరంగంలో వ్యూహాలు, ప్రతివ్యూహాలు నేతల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఎవరిది పైచేయి అవుతుందో..ఎవరిది ‘ పాము ‘ బారిన పడి దిగజారుతుందో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా నిర్దేశిస్తారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోదీ, అమిత్ షాల పొలిటికల్ స్ట్రాటజీ ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యూహం బలాదూర్ గా మిగిలిపోయింది. ఆ ఇద్దరి చక్రవ్యూహంలో ఆయన ‘ చిక్కుకుని ‘ విలవిలలాడారు. ఫలితంగా ఘన విజయం మోదీ, షాలను వరించగా.. రాహుల్ ప్రచార వ్యూహాలు బెడిసి కొట్టాయి. రాహుల్ ఎంతసేపూ మోదీని రాఫెల్ విమానాల వివాదంలో ‘ చౌకీదార్ చోర్ హై ‘ అంటూ దుయ్యబడుతూ వచ్చారు. కానీ ఈ ‘ నినాదాన్ని ‘ పార్టీ సీనియర్ నేతలు గట్టిగా దేశ మారుమూల ప్రాంతాల్లోకి కాదు గదా.. కనీసం యూపీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలకు కూడా తీసుకువెళ్లలేకపోయారు. మోదీ తన ప్రచార ప్రసంగాల్లో.. ఎప్పుడైతే రాహుల్ తండ్రి దివంగత పీఎం రాజీవ్ గాంధీ పేరును బయటికి లాగారో అప్పటినుంచే రాహుల్ ప్రచారం బలహీనపడిపోయింది. దేశ భద్రతలో రాజీవ్ గాంధీ అనుసరించిన నిర్లక్ష్యాన్ని, ఆయన అవినీతి పాలన గురించి మోదీ ప్రజల మనస్సుల్లో బలంగా నాటగలగడంలో కృత కృత్యులయ్యారు.బాలాకోట్ పై వైమానిక దాడులు జరపాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన వివరించగలిగారు కూడా… ఈ దేశ భద్రత, పేదల ప్రయోజనాలను తామే కాపాడగలమన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించగలిగారు. పొరుగున ఉన్న పాకిస్థాన్ మినహా ఇతర దేశాలతో మోదీ ప్రభుత్వం కొనసాగిస్తున్న స్నేహ సంబంధాలు ఓటర్లను ఆకర్షించగలిగాయి. పుల్వామా ఘటన అనంతరం పాక్ పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసి, తగిన ‘ ప్రతీకారం ‘ తీర్చుకున్న అంశాన్ని ప్రజలు ఆమోదించారు. మోదీ పైనా, ఆయన పాలనపైనా రాహుల్ చేసిన ట్వీట్లు కూడా ఆయనను కాపాడలేకపోయాయి. ఎన్నికలు జరగడానికి నాలుగైదు నెలల ముందే అమిత్ షా చేసిన దేశ వ్యాప్త పర్యటన బీజేపీకి లాభించింది. ముఖ్యంగా రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలన్న మోదీ , అమిత్ షాల పిలుపు ప్రభావం ప్రజలపై బాగా పని చేసింది. నెహ్రు-.గాంధీ కుటుంబాలు తమ వారసులను అటు పార్టీలోనూ, ఇటు దేశంలోనూ హైలైట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ ‘ ద్వయం ‘ ప్రధానంగా ప్రస్తావించింది. యూపీలో విజయం కోసం రాహుల్ తన సోదరి ప్రియాంక గాంధీని రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. ఎన్డీయే సర్కార్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసేందుకు 23 విపక్షాలు వేసిన వ్యూహాలు ….మోదీ, అమిత్ షా ల చక్రవ్యూహం ముందు వెలవెలబోయాయి.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??