తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
Ram Naramaneni | Edited By: Anil kumar poka
Updated on: Mar 20, 2019 | 6:11 PM
హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల ప్రచారం ముగిసింది. గ్రాడ్యువేట్స్, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఈ నెల 22న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్ – మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకే ప్రచారం ముగిసింది.. ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం […]
హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల ప్రచారం ముగిసింది. గ్రాడ్యువేట్స్, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఈ నెల 22న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్ – మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకే ప్రచారం ముగిసింది.. ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓటర్లు ప్రాధాన్య క్రమంలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.