తెలంగాణ 2021-22 వార్షిక బడ్జెట్‌ రూ.2,30,825 కోట్లు.. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ -హరీశ్‌రావు

|

Mar 18, 2021 | 12:12 PM

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 2021-22 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అందరూ ఊహిస్తున్నట్టుగానే ఈ సారి రూ.2,30,825.96 కోట్లతో భారీ బడ్జెట్‌

తెలంగాణ 2021-22 వార్షిక బడ్జెట్‌ రూ.2,30,825 కోట్లు.. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ -హరీశ్‌రావు
Ts Budget
Follow us on

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 2021-22 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అందరూ ఊహిస్తున్నట్టుగానే ఈ సారి 2, 30, 825.96 కోట్లతో భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అనంత‌రం బ‌డ్జెట్ కాపీని మంత్రి చ‌దివి వినిపించారు.

రాష్ర్ట బ‌డ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు

రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు

ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు

పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు

వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్

తనకు గురుతర బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఏడేళ్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అనేక రాష్ట్రాలను ప్రగతిలో అధిగమించిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు.

అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచిందిన మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిర్దేశిత లక్ష్యాలను ఎంచుకుని నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు అధిగమిస్తూ ప్రగతి పథాన పయనిస్తున్నామని తెలిపారు.

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్తితిపై కూడా కరోనా ప్రభావం గణనీయంగా పడిందని అన్నారు. అయినా సంక్షేమ పథకాల విషయంలో రాజీ పడలేదని హరీశ్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపొందించామని అన్నారు.

Read More:

మేకలు కాసిన ఏపీ ఎమ్మెల్యే.. దుడ్డుకర్ర చేతబట్టి.. తలపాగా చుట్టి.. ఆశ్చర్యపోయిన స్థానికులు

రెండు చోట్లా గెలిచాడు.. చివరికి ఎక్కడా కాకుండా పోయాడు.. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన