30 నెలల్లో 3 సార్లు ఓడిపోయిన వ్యక్తికి ఓటేద్దామా..? లక్ష మందికి విద్యాబుద్దులు నేర్పిన వ్యక్తిని గెలిపిద్దామా..? -హరీశ్‌రావు

రాష్ట్ర విభజన హామీ లో బయ్యారం ఉక్కు కంపెనీ, ఐటీఐఆర్ ఉండే, కాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ ఉండే. కానీ, ఇప్పటివరకు అమలు కాలేదు. ప్రశ్నించే గొంతు అంటున్నారు. ప్రశ్నిస్తే కేంద్ర..

  • K Sammaiah
  • Publish Date - 4:23 pm, Fri, 5 March 21
30 నెలల్లో 3 సార్లు ఓడిపోయిన వ్యక్తికి ఓటేద్దామా..? లక్ష మందికి విద్యాబుద్దులు నేర్పిన వ్యక్తిని గెలిపిద్దామా..? -హరీశ్‌రావు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణిదేవిని గెలిపించుకునేందుకు మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. శంకర్ పల్లి లోని ప్రైవేట్ పంక్షన్ హాల్ లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో మహబూబ్ నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి ,టీఆరెస్ నాయకులు గట్టు రామచంద్రరావు, కార్తీక్ రెడ్డి ఇతర టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి తిరుగుతున్నాం. రోజురోజుకు మన అభ్యర్థి దూసుకుపోతున్నారని చెప్పారు. నిన్న చాలా మంది నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్న చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. బిజెపి అభ్యర్థి రాంచందర్ రావు పై చాలా వ్యతిరేకత ఉందన్నారు. ఆరేండ్లు ఎమ్మెల్సీ గా ఉండి ఒక్క రోజు కూడా మా ఊరు కి రాలేదు అని జనాలు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని హరీశ్‌రావు చెప్పారు. నిన్న జడ్చర్ల లో లాయర్లు ఆయనను తమ బార్ అసోషియోషన్ కు రావద్దని వెనుకకు పంపించారు. నీవు గెలిసి ఎం చేసావని ప్రశ్నించారు.

బీజేపీ అభ్యర్థి రామ్‌చందర్‌రావుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గా 2018 లో పోటీ చేశాడు, 2019 లో ఎంపీ పోటీ చేశాడు కానీ ప్రజలు తిరస్కరించారు. ముచ్చట గా 30 నెలలో మూడు సార్లు ఒడిపోతున్నాడు. మన అభ్యర్థి గొప్ప అనుభవము ఉన్న వ్యక్తి, ఒక్క లక్ష మందికి విద్య బుద్దులు నేర్పిన వ్యక్తి వాణి దేవి గారు. పివి కుమార్తె గా ఉండి అనేక దేశాలు తిరిగి ఎన్నో నేర్చుకుంది. మహిళ అభ్యర్థి మన వాణి దేవి గారు ఆమెకు మహిళలు ఓటు వేస్తే గెలుస్తోంది. బిజెపి కి ఎందుకు ఓటు వేయాలి. ఒక్క సంవత్సరం లో 215 రూపాయల గ్యాస్ ధర పెంచారు. లీటర్ పెట్రోల్ 100 రూపాయలు అయింది. రాష్ట్రనికి కోత, జనాలకు వాత మనకు ఇచ్చింది ఎం లేదని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

రాష్ట్ర విభజన హామీ లో బయ్యారం ఉక్కు కంపనీ, ఐటీ ఐ ఆర్ ఉండే, కాజీ పెట్ కోచ్ ఫ్యాక్టరీ ఉండే కానీ ఇప్పటివరకు అమలు లేదు. ప్రశ్నించే గొంతు అంటున్నారు. ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం ను ప్రశ్నించండి. కాంగ్రెస్ కనీసం పోటీలో లేరు,వాళ్ళు ఎవరు పీసీసీ అవుతారో వాళ్లకే తెల్వదు.ఒక్కరికి పీసీసీ ఇస్తే ఇంకొకరు పార్టీ నుండి వెళ్తాము అని బెదిరింపులు వాళ్ళది గట్ల ఉంది. కొండ విశ్వేశ్వరరెడ్డి ఏ పార్టీ లో ఉన్నాడో ఆయనకే తెల్వది. 2014 కు ముందు శంకర్ పల్లిలో పరిస్థితి ఏంది,ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది తెలుసుకోవాలన్నారు. అప్పట్లో చనిపోతే కనీసం స్నానం చేద్దాం అంటే కరెంట్ లేక వాళ్లకు వీళ్ళకు ఫోన్ లు చేసి కరెంట్ వేయించుకునే వారు ఇప్పుడు అలంటి పరిస్థితి ఉందా అని మంత్రి ప్రశ్నించారు.

పెరిగిన పెట్రోల్ తో బిజెపి కి ఓటు వేసే పరిస్థితి లేదు. ప్రతి ఓటర్ ను కలిసి ఓటు వేయించే బాధ్యత మనది. సోషల్ మీడియాలో బిజెపి చేసిన వాటి గురించి కౌంటర్ ఇవ్వాలి. వాళ్ళు ఒక్కటీ రెండు గెలిసారో లేదో వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. వాళ్ళ సిట్టింగ్ సిటు రాంచందర్ రావును ఓడించాలి. వాణి దేవి ని గెలిపించుకోవాలని మంత్రి హరీశ్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Read More:

ఆ విషయాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలి.. స్వయం సహాయక సంఘాలపై సమీక్షలో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ఆదేశం