దానికోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. బీజేపీ అబద్దాల పునాదులపై అధికారం కోసం అర్రులు చాస్తోంది -మంత్రి ఎర్రబెల్లి
ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో ఒకటైన కాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రం పై రాష్ట్రపంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు..
ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో ఒకటైన కాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రం పై రాష్ట్రపంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు తీవ్రంగా స్పందించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం దేనికైనా సిద్ధమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 20 ఏళ్ల కల అని, కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ అనుమతితో ఆందోళనా కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కేటాయించాలని విభజన చట్టంలోనే ఉందన్నారు.
కోచ్ ఫ్యాక్టరీతో పాటు బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, కేంద్రం మోసం చేసిందన్నారు ఎర్రబెల్లి. గిరిజన యూనివర్సిటీ కోసం 600 ఎకరాలు సేకరించినా, ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని ఇది గిరిజనులకు తీవ్ర ద్రోహం చేయడమే అన్నారు ఎర్రబెల్లి. తెలంగాణలోని బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంతో పోరాడి కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాలని సవాల్ విసురుతున్నారు ఎర్రబెల్లి. రైలు డబ్బాలు కడిగే ఫ్యాక్టరీ మాకొద్దని, కోచ్ ఫ్యాక్టరీ కావాలని డిమాండ్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇప్పటికే 150 ఎకరాలు సేకరించామని, అయితే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేమని ఇప్పుడు కేంద్రమంత్రి చెప్పడంపై మండిపడ్డారు ఎర్రబెల్లి. గతంలో దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సమాచార హక్కుచట్టం ప్రశ్నకు రైల్వేకోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు వసరం లేదని కేంద్ర రైల్వేశాఖ చెప్పడం సిగ్గుచేటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దుయ్యబట్టారు. బిజేపీ తెలంగాణ ప్రజలకు సమాధానంచెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. ఏం ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లుఅడుగుతారని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఎన్నిఅబద్ధాలు ఆడతారు? తెలంగాణ ప్రజల్ని ఎంత కాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అంటే భారతీయ బొంకుడుపార్టీ అని తేలిపోయిందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
టీఆర్‌ఎస్ పార్టీ త్యాగాల పునాదులమీద తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తుంటే బీజేపీ అబద్దాల పునాదులపై అధికారం కోసం అర్రులుచాస్తోందని విమర్శించారు. ఇప్పటి దాకా బీజేపీ బండి, గుండు, తొండి మాటలతో ప్రజల చెవుల్లోపువ్వులుపెట్టారని అన్నారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర బీజేపీ చెవుల్లో కేంద్రం పువ్వులు పెట్టిందనారు. తెలంగాణకు అన్యాయంచేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరిగానే కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీకి బిజెపి మంగళం పాడిందన్నారు. కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలు మార్లు కేంద్రాన్నిసీఎంకేసీఆర్ కోరారని గుర్తుచేశారు. తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమిస్తామని ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి స్పష్టంచేశారు.
Read More:
ఆ విషయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి.. స్వయం సహాయక సంఘాలపై సమీక్షలో సీఎస్ సోమేష్‌కుమార్ ఆదేశం