AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్‌ డీలర్ల మద్దతు టీఆర్‌ఎస్‌కే… ఒక్కో డీలర్‌ ద్వారా ఐదు వందల గ్రాడ్యుయేట్‌ ఓట్లు -మంత్రి గంగుల

పౌరసరఫరాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, కరోనా సంక్షోభంలో సైతం చక్కటి పనితీరును రేషన్ డీలర్లు కనబర్చారని కొనియాడారు ఎమ్మెల్సీ ఎన్నికల..

రేషన్‌ డీలర్ల మద్దతు టీఆర్‌ఎస్‌కే... ఒక్కో డీలర్‌ ద్వారా ఐదు వందల గ్రాడ్యుయేట్‌ ఓట్లు -మంత్రి గంగుల
Gangula Kamalakar
K Sammaiah
|

Updated on: Mar 08, 2021 | 12:35 PM

Share

పౌరసరఫరాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, కరోనా సంక్షోభంలో సైతం చక్కటి పనితీరును రేషన్ డీలర్లు కనబర్చారని కొనియాడారు ఎమ్మెల్సీ ఎన్నికల హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి గంగుల కమలాకర్. జలవిహార్లో జరిగిన తెలంగాణ రేషన్ డీలర్ల హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రశంగించారు.

తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్దిగా పనిచేస్తుందని, ఆకలితో అలమటిస్తూ ఏ ఒక్కరూ ఉండకూడదనే సీఎం కేసీఆర్ గారి సంకల్పాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరుస్తున్న వారియర్స్ రేషన్ డీలర్లని, కోవిడ్ సంక్షోభంలో సైతం ప్రభుత్వ ప్రాధమ్యాల మేరకు ఎక్కువ రోజులు పనిదినాలు నిర్వహించి ప్రజలందరికీ సక్రమంగా రేషన్ అందడంలో డీలర్లు పోషించిన పాత్ర మరవలేనిదని కొనియాడారు మంత్రి.

రేషన్ డీలర్ల సంక్షేమం కోసం 164 కోట్ల కమిషన్ డబ్బులను వారి ఖాతాల్లో జమచేయడం జరిగిందని, కారుణ్య నియామకాలకు సంబందించి వయో పరిమితిని 40 ఏళ్లనుండి 50 ఏళ్లకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. గన్నీ బ్యాగుల రేటును 16 రూ నుండి 18 రూపాయలకు పెంచడం, రెండేళ్లకోసం కొనసాగే అథరైజేషన్ని ఐదేండ్ల కాలపరిమితితో చేసే ప్రతిపాదనతో పాటు రేషన్ డీలర్ల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతిపాదనలు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నయని తెలియజేశారు.

సమాజంలోని అన్నివర్గాలను అభ్యున్నతి దిశగా తీసుకెళ్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై ఓర్వలేక చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని, కేవలం పబ్బంగడుపుకునే మాటలతో కాలం వెల్లదీస్తున్న బీజేపీ నేతలు, మనకు దక్కాల్సిన ఐటీఐఆర్, నిన్నటి వ్యాగన్ ప్యాక్టరీలు తెలంగాణకు ఇవ్వకుండా చేసిన మోసాన్ని గుర్తుచేశారు. ఈ ఆరేళ్లలో 2,72,926 కోట్లను పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి జమచేస్తే కేవలం 1,40,329 కోట్లను మాత్రమే మనకి తిరిగిచ్చిన సత్యాన్ని గుర్తుచేశారు. దేశప్రగతిలో తెలంగాణ గణనీయ క్రుషి జరుపుతుంటే…. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే చందాన, తిండి మనది తింటూ కేంద్రం పాట పాడుతున్న కుసంస్కారులకు పట్టభద్రులు రాబోయే ఎన్నికల్లో బుద్దిచెప్పాలని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెడ్తున్న రీతిలో ఉన్న బీజేపీ మాటల్ని ఖండించారు. జాతీయ స్థాయిలో మన తెలంగాణ ఠీవి గా నిలిచిన పీవీ కూతురు ఉన్నత విద్యావేత్త సురభి వాణిదేవిగారికి మెదటి ప్రాదాన్యతా ఓటు వేసి గెలిపించాలని మంత్రి గంగుల కోరారు.

స్వాతంత్ర్యం వచ్చి ఎనబై ఏళ్ళ లో తెలంగాణ ఎట్లుంది, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన ఆరేళ్ల లో నే భగిరథతో నీళ్ళు, 13లక్షల క్వింటాల ధాన్యం నుండి కోటీ ఇరవై లక్షల క్వింటాళ్లు సేకరించే స్థాయికి ఎదిగాం, సుస్థిర శాంతి భద్రతలతో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయి. ఈ అభివృద్ధిని కొనసాగించడానికి వాణీదేవిని గెలిపించాలని మంత్రి గంగుల కోరారు.

సమావేశంలో మాట్లాడిన రేషన్ డీలర్ల ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరిస్తామని, బేషరతుగా మద్దతు తెలపడంతో పాటు ఒక్కొక్కరు ఐదువందల మంది గ్రాడ్యుయేట్ ల ఓట్లేసేలా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు మహామూద్ ఆలి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు పుస్తె శ్రీకాంత్, నాయకోటి రాజు, సంజీవరెడ్డి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన రేషన్ షాప్ డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More:

రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు.. ఆజాద్‌ స్థానంలో ఖర్గేను ప్రతిపాదించిన కాంగ్రెస్‌

గుత్తాకు గుండె నొప్పి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు.. పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి