పాలకుర్తి సోమేశ్వరాలయంలో ఎర్రబెల్లి దంపతుల ప్రత్యేక పూజలు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో దేవాలయాలకు పూర్వవైభవమన్న మంత్రి

|

Mar 12, 2021 | 7:48 AM

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని దేవాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ..

పాలకుర్తి సోమేశ్వరాలయంలో ఎర్రబెల్లి దంపతుల ప్రత్యేక పూజలు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో దేవాలయాలకు పూర్వవైభవమన్న మంత్రి
Follow us on

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని దేవాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో జరిగిన శివ పార్వతి ల కల్యాణోత్సవంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన సతీమణి ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు పాల్గొన్నారు. స్వామి అమ్మ వార్ల కు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి దంపతులు.

శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే రోజు శివరాత్రి అని మంత్రి తెలిపారు. శివరాత్రి రోజు శివుడు – పార్వతి ల పెళ్లి జరిగిన రోజు. లింగోద్భవం జరిగిన రోజుగా శివ పురాణం చెబుతున్నది. శివ – శక్తి కలయిక రోజుగా కూడా మహా శివరాత్రి ని పేర్కొంటారని మంత్రి తెలిపారు. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున…ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేస్తారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినంగా మంత్రి వివరించారు.

పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడని మంత్రి తెలిపారు. తపస్సు, యోగ, ధ్యానం వాటి అభ్యాసం ముక్తి పొందడానికి దారులుగా చెప్పవచ్చు. దేశ విదేశాల్లోని శివ భక్తులు కూడా పండుగను అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు. శివరాత్రి, రాజయోగ విశిష్టతను తెలిపే విధంగా ఇక్కడ ప్రతి ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలు జరపడం సంతోషదాయకం అని మంత్రి చెప్పారు.

అద్భుతమైన శివలింగ దర్శనం తో పాటు, శివ, జీవ తత్వాన్ని ప్రజలకు, ప్రత్యేకించి శివ భక్తులకు అందించడం హర్ష దాయకం. ఆత్మశుద్ధి యే అభిషేకం. అన్నపానాదులు మాని, శివనామ స్మరణ చేయడమే ఉపవాసం. కామ క్రోధ మధ మాత్సర్యములను శివార్పణం చేయడమే జాగరణ. మనస్సును శివైక్యం చేయడమే రాజయోగం. భక్తి ని ప్రచారం చేస్తూ, ముక్తి ని ప్రసాదిస్తున్న ఇక్కడి పూజారులు, ఆలయ అధికారుల ప్రయత్నాలను,శ్రమను అభినందిస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ప్రజలంతా శాంతి సౌఖ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత దేవాలయాల జీర్ణోద్ధరణ, ధూప దీప నైవేద్యాలు, అర్చకులకు జీతభత్యాల పెంపు, అర్చకుల వయో పరిమితి పెంపు, యాదాద్రి వంటి అనేకానేక చర్యలతో దేవాలయాలు తెలంగాణలో దేదీప్య మానం అవుతున్నాయని మంత్రి వివరించారు.

Read More:

కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదు.. ఆ సూచనను కేంద్రం పట్టించుకోలేదన్న కేటీఆర్‌