
అమరావతిలో మీడియాతో మాట్లాడారు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. ఈ సందర్బంగా కేసీఆర్, జగన్‌లపై నిప్పులు చెరిగారు. అప్పుడేమో.. పోలవరం ప్రాజెక్టు ఆపాలని సుప్రీంకోర్టులో కేసులు వేశారు.. ఇప్పుడేమో పోలవరానికి అడ్డంపెట్టనని కేసీఆర్ అంటున్నారు.. ఏవి నమ్మాలో కూడా మీరే చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌వి అన్నీ బూటకపు హామీలేనని ఆయన అన్నారు. పోలవరానికి అడ్డం కానప్పుడు కేసీఆర్ ఎందుకు ఇన్ని కేసులు వేశారు..? అని ప్రశ్నించారు దేవినేని. వెయ్యి కోట్లకు అమ్ముడుపోయిన జగన్.. కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తున్నారు. కేసీఆర్‌కు జగన్ ఒక సామంతుడి మాదిరిగా తయారయ్యారన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తుందా..? ఇదేం విడ్డూరమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2019 జులై నాటికి గ్రావిటీతో నీరిచ్చేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. జగన్, కేసీఆర్‌లు తప్ప లక్షలాదిమంది పోలవరం చూసి సంబర పడుతున్నారు. సమాజంలో సమస్యలు, ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో చేశారు చంద్రబాబు. ఎన్నికల తర్వాత నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు దేవినేని ఉమా.