జగన్‌కు ఇక్కడ అడుగుపెట్టే అర్హత లేదు: మంత్రి నక్కా ఆనందబాబు

Vijay K

Vijay K |

Updated on: Mar 20, 2019 | 2:44 PM

విజయవాడ: ప్రతిపక్ష నేత జగన్‌పై మంత్రి నక్కా ఆనందబాబు ఫైరయ్యారు. డెల్టా ప్రాంతంలో పర్యటించే హక్కు వైకాపా అధ్యక్షుడు జగన్‌కు లేదని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. పట్టిసీమను వ్యతిరేకించి కట్టడానికి వీల్లేదని అప్పుడు జగన్‌ అడ్డుపడ్డారని విమర్శించారు. ఈ ప్రాంత రైతులకు పట్టిసీమ ద్వారా 13 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పుడు డెల్టా సస్యశ్యామలంగా ఉందని వివరించారు. ఈ పది రోజులూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాలు గ్రహించి […]

జగన్‌కు ఇక్కడ అడుగుపెట్టే అర్హత లేదు: మంత్రి నక్కా ఆనందబాబు

విజయవాడ: ప్రతిపక్ష నేత జగన్‌పై మంత్రి నక్కా ఆనందబాబు ఫైరయ్యారు. డెల్టా ప్రాంతంలో పర్యటించే హక్కు వైకాపా అధ్యక్షుడు జగన్‌కు లేదని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. పట్టిసీమను వ్యతిరేకించి కట్టడానికి వీల్లేదని అప్పుడు జగన్‌ అడ్డుపడ్డారని విమర్శించారు.

ఈ ప్రాంత రైతులకు పట్టిసీమ ద్వారా 13 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పుడు డెల్టా సస్యశ్యామలంగా ఉందని వివరించారు. ఈ పది రోజులూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాలు గ్రహించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా వేమూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu