కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

హైదరాబాద్: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మల్కాజ్‌గిరిలో తనకు వ్యతిరేకంగా పోటీ చేయాలని అన్నారు. పార్టీ ఎల్‌బీనగర్‌ నియోజవర్గ ఎన్నికల కార్యాలయాన్ని మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. సీఎం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు తనపై 60 కేసులు పెట్టారని చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, తాను […]

కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్
Follow us

|

Updated on: Mar 20, 2019 | 2:40 PM

హైదరాబాద్: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మల్కాజ్‌గిరిలో తనకు వ్యతిరేకంగా పోటీ చేయాలని అన్నారు. పార్టీ ఎల్‌బీనగర్‌ నియోజవర్గ ఎన్నికల కార్యాలయాన్ని మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు.

సీఎం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు తనపై 60 కేసులు పెట్టారని చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, తాను సైనికాధిపతిగా ముందుండి నడిపిస్తానన్నారు. ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలే లేకుండా చేస్తున్నప్పుడు ఇక ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.