కేరళ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థి మెట్రో మ్యాన్ శ్రీధరన్, ప్రకటించిన కమలనాథులు
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు తమ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్.ఈ. శ్రీధరన్ ని బీజేపీ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత నెలలో బీజేపీలో చేరిన ఆయన..
Kerala Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికలకు తమ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్.ఈ. శ్రీధరన్ ని బీజేపీ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత నెలలో బీజేపీలో చేరిన ఆయన.. కేరళ ఎన్నికల్లో పోటీచేయలనే కాదు..పైగా ముఖ్యమంత్రి పదవి పట్ల ఆసక్తి చూపుతున్నానని కూడా వ్యాఖ్యానించారు.ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్లో యూనిఫామ్ లో ఆయన పనిచేసే చివరి రోజు కూడా గురువారమే. టెక్నోక్రాట్ అయిన ఈయనకు ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా మంచి పేరుంది. దేశంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ సిస్టం ను బలోపేతం చేయడంలో ఈయన అత్యంత సమర్థుడని అంటారు. ఇక- సీఎం రేసులో శీధరన్ ఉంటారని బీజేపీ కేరళ చీఫ్ కె.సురేంద్రన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే తను ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతానని శ్రీధరన్ గత నెల 19 న ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఇక్కడ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాల్సి ఉందని ఆయన లోగడ పేర్కొన్నట్టు సురేంద్రన్ వెల్లడించారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా చేపట్టలేకపోయిందని, దీనికి ఏదోవిధంగా తనవంతు సేవ చేయాలనుకుంటున్నానని శ్రీధరన్ లోగడ తెలిపారు. గవర్నర్ గా కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ఉందలచారన్న ప్రశ్నకు ఆయన.. గవర్నర్ గా సేవ చేసే అవకాశం చాలా తక్కువని, అదే సీఎం అయితే ఇందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అటు-ఏప్రిల్ 6 న జరిగే ఎన్నికలకు కేరళ బీజేపీ 16 మంది సభ్యులతో రాష్ట్ర ఎలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సంప్రదించి ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు సురేంద్రన్ తెలిపారు. శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా చేయాలన్న తమ ప్రతిపాదనను ఆయన అంగీకరించారని సురేంద్రన్ వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
India vs England 4th Test Live: అయ్యో అప్పడే…! తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..