గేమ్ స్టార్ట్… కమల్‌నాథ్‌ కుర్చీకి కమలం ఎసరు

| Edited By:

May 20, 2019 | 3:24 PM

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పూర్తి మెజార్టీని ఎన్డీఏకి కట్టబెట్టడంతో కమల దళం ఫుల్ జోష్ లో ఉంది. కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్నామన్న ఆత్మవిశ్వాసంతో… మిగతా రాష్ట్రాలలో అధికారం కోసం అప్పుడే బీజేపీ స్కెచ్ వేసింది. తొలి విడతగా మధ్యప్రదేశ్‌లో ఆటను మొదలు పెట్టింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని పేర్కొంటూ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు లేఖ రాసింది. సీఎం క‌మ‌ల్‌నాథ్ ప్ర‌భుత్వం మైనార్టీలో ఉందని, త‌క్ష‌ణ‌మే ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాల‌ను ఏర్పాటు చేయాల‌ని […]

గేమ్ స్టార్ట్... కమల్‌నాథ్‌ కుర్చీకి కమలం ఎసరు
Follow us on

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పూర్తి మెజార్టీని ఎన్డీఏకి కట్టబెట్టడంతో కమల దళం ఫుల్ జోష్ లో ఉంది. కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్నామన్న ఆత్మవిశ్వాసంతో… మిగతా రాష్ట్రాలలో అధికారం కోసం అప్పుడే బీజేపీ స్కెచ్ వేసింది. తొలి విడతగా మధ్యప్రదేశ్‌లో ఆటను మొదలు పెట్టింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని పేర్కొంటూ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు లేఖ రాసింది.

సీఎం క‌మ‌ల్‌నాథ్ ప్ర‌భుత్వం మైనార్టీలో ఉందని, త‌క్ష‌ణ‌మే ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆ లేఖలో కోరింది. అసెంబ్లీని స‌మావేశ‌ప‌రిస్తే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని.. బీజేపీ నేత గోపాల్ భార్గ‌వా కామెంట్స్ చేశారు.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ… స్వ‌ల్ప మెజారిటీతోనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. 230 సీట్లు ఉన్న.. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 116 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు ఒక అడుగు దూరంలో కాంగ్రెస్ నిలిచిపోయింది. 114 సీట్లను సాధించిన కాంగ్రెస్.. సమాజ్ వాదీ పార్టీ (1), బీఎస్పీ (2), ఇండిపెండెంట్లు (4) సహకారంతో అధికారాన్ని చేపట్టింది. అయితే బీజేపీ 109 సీట్లను గెలుచుకుంది. 15 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారాన్ని చేపట్టింది.