ECI Notice: ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. ఏప్రిల్ 29లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ విచారణ చేపట్టింది. మతం, కులం, వర్గం, భాష ప్రాతిపదికన విద్వేషం, విభజన సృష్టిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌లు ఆరోపించాయి. ఇద్దరికి నోటీసులు జారీ చేసిన కమిషన్ ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు సమాధానం కోరింది.

ECI Notice: ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. ఏప్రిల్ 29లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు
Pm Modi Rahul Gandhi
Follow us

|

Updated on: Apr 25, 2024 | 2:04 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ విచారణ చేపట్టింది. మతం, కులం, వర్గం, భాష ప్రాతిపదికన విద్వేషం, విభజన సృష్టిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌లు ఆరోపించాయి. ఇద్దరికి నోటీసులు జారీ చేసిన కమిషన్ ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు సమాధానం కోరింది.

తమ అభ్యర్థులు, ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్ల ప్రవర్తనకు రాజకీయ పార్టీలు ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల ప్రచార ప్రసంగాలు మరింత తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటాయని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 77 ప్రకారం ‘స్టార్ క్యాంపెయినర్’ హోదాను మంజూరు చేయడం చట్టబద్ధంగా పూర్తిగా రాజకీయ పార్టీల పరిధిలోనిదని, వారి ప్రసంగాల నాణ్యతకు స్టార్ క్యాంపెయినర్లు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొంది.

ఇటీవల, రాజస్థాన్‌లోని బన్స్‌వారాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి దేశ సంపదను పంచవచ్చని అన్నారు. ప్రధాని మోదీ ఈ ప్రకటన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ప్రధాని హిందువులు, ముస్లింలను విభజించడం మొదలుపెట్టారని ఆరోపించారు. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్‌ ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో తాజాగా నోటీసులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల కమీషన్.

అదే సమయంలో, రాహుల్ గాంధీ తన ర్యాలీలలో అనుచిత భాష ఉపయోగించారని బీజేపీ ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తమిళనాడులో భాషా ప్రాతిపదికన ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో భాషా ప్రాతిపదికన ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ తన లిఖితపూర్వక ఫిర్యాదులో డిమాండ్ చేసింది. దీంతో సమాధానం ఇవ్వాలంటూ రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం నోటీసలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles