వేసవిలో ఈ గింజలు తింటే ఈజీగా బరువు తగ్గుతారు..!

Jyothi Gadda

05 May 2024

వేసవిలో మార్కెట్‌లో బొప్పాయి ఎక్కువగా లభిస్తుంది. ప్రతి రోజు బొప్పాయిని తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బొప్పాయి పండే కాదు ఇందులోని గింజలు కూడా శరీరానికి ఎంతగానో సహాయపడతాయి. ఎందుకంటే ఈ గింజల్లో ఉండే కొవ్వు, ప్రోటీన్, జింక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

బొప్పాయి గింజల్లో ఉండే గుణాలు శరీర బరువు, మధుమేహం సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. అలాగే ఈ బొప్పాయి పండ్లను తినడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి.

వేసవి కాలంలో చాలా మంది బరువు పెరుగుతుంటారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు బొప్పాయి గింజలను తీసుకోవచ్చు. ఇందులోఉండే  ఫైబర్‌ శరీర బరువును నియంత్రిస్తుంది. 

బొప్పాయి గింజల్లో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను వేగంగా కరిగిస్తుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు ఆకలిని నియంత్రించేందుకు సహాయపడుతుంది.

బొప్పాయి గింజలు పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. మలబద్దకం, పొట్ట ఉబ్బరం, నొప్పి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో పపైన్ అనే కరిగే ఫైబర్, ఎంజైమ్‌లు లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి.

బొప్పాయి గింజల్లో ఉండే కార్పెన్ అనే మూలకాలు పొట్టలో పేగులను శుభ్రం చేసేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే కొన్ని ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లు గుణాలు పేగుల్లో నివసించే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. 

బొప్పాయి విత్తనాలు మధుమేహంతో బాధపడేవారికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఎక్కువగా ఫైబర్‌ లభిస్తుంది. కాబట్టి ఈ గింజలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.