శ్రీశైలంలో చూడదగ్గ ప్రదేశాలు..
TV9 Telugu
05 May 2024
శ్రీశైలంలో మొదటిగా చూడవలసినది దేశంలో ఉన్న 12 పవిత్రమైన జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున ఆలయం.
దీని తర్వత అక్కడే కొలువవై ఉన్న అస్టోదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రమరాంబిక దేవి ఆయాలన్ని దర్శించుకోవాలి.
వీటి తర్వాత ప్రతి ఒక్కరు దర్శించే సాక్షి గణపతి టెంపుల్ ఒకటి. ఇక్కడ గణపతిని కోరిన కోరిక కచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం.
ఆ తర్వాత చూడవలసిన మరో ప్రదేశం పాలధార, పంచదార అనే రెండు నీటి ధరలు. ఇక్కడ నీటిని తాగితే సర్వ రోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం.
హటకేశ్వరం కూడా శ్రీశైలంలో దర్శించదగ్గ ప్రదేశం. శివ భక్తుడు కమ్మరి కేశప్పకు శివుడు కుండపెంకులో బంగారు లింగం రూపంలో ఇక్కడ కనిపించాడు.
శ్రీశైల శిఖరం ఒకటి చూడదగ్గ ప్రదేశం. ఇక్కడ నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తే మల్లికార్జున ఆలయ గోపురం కనిపిస్తుంది.
శ్రీశైలంలోని అక్క మహాదేవి గుహలు అత్యంత సాహసోపేతమైన అనుభవాలలో ఒకటి. మీ ప్రయాణంలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం.
మల్లికార్జున ఆలయానికి కిలోమీటరు దూరంలో కృష్ణానది బ్యాక్ వాటర్ పాతాళ గంగ. ఇక్కడ నదిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి