అస్వస్థతకు గురైన చంద్రబాబు ప్రత్యర్థి.. పరామర్శించిన జగన్

వైసీపీ కుప్పం అభ్యర్థి, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రాజమౌళి ఆరోగ్యంపై వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాగా చంద్రమౌళి కుప్పం నియోజకవర్గం నుంచి సీఎం చంద్రబాబుపై […]

అస్వస్థతకు గురైన చంద్రబాబు ప్రత్యర్థి.. పరామర్శించిన జగన్

Edited By:

Updated on: Apr 19, 2019 | 5:54 PM

వైసీపీ కుప్పం అభ్యర్థి, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రాజమౌళి ఆరోగ్యంపై వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాగా చంద్రమౌళి కుప్పం నియోజకవర్గం నుంచి సీఎం చంద్రబాబుపై పోటీచేసిన విషయం తెల్సిందే.