Kuppam TDP: పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీకి కుప్పుంలో వ్యతిరేక పవనాలు వీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారట. అధినేత చంద్రబాబు ఇలాఖాలోనే గెలవలేకపోవడంతో వారు ముఖాలు చూపించలేకపోతున్నారట. బాబు కుప్పం రాబోతున్న క్రమంలో ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని చర్చ జరుగుతుంది. అందుకే చాలామంది రాజీనామాలకు సిద్దమవుతున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు.
పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న పీఎస్ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్ ఏం చేయాలనేదానిపై కార్యకర్తలతో చర్చించారు. ఈ భేటీలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు కార్యకర్తలు. టీడీపీ సీనియర్ నేత గౌనివారి శ్రీనివాసులు సొంత పంచాయతీలోకే సర్పంచ్‌ను గెలిపించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మరి బాబుతో భేటీ అనంతరం ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.
Also Read:
మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఒకే హాస్టల్లో 39 మందికి విద్యార్థినులకు పాజిటివ్.. తస్మాత్ జాగ్రత్త
పిల్లలతో కలిసి భార్య సరుకులు తెచ్చేందుకు వెళ్లింది.. తిరిగొచ్చేసరికి భర్త ఇలా చేశాడు