
సార్వత్రిక ఎన్నికలకు ముందు పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు తన పదవికి రాజీనామా చేశారు. కాగా 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన ఆయన.. టీడీపీ తీర్థం పుచ్చుకుని కార్పోరేషన్ పదవిని దక్కించుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసాపురం టికెట్‌ను కొత్తపల్లి ఆశించారు. టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన మంగళవారం మధ్యాహ్నం కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే అనుచరులు, కుటుంబీకులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని సుబ్బరాయుడు తెలిపారు.