టీడీపీకి మరో షాక్.. స్వతంత్ర అభ్యర్థిగా కొత్తపల్లి

పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పార్టీలో ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీని వీడనున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నరసాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఎంపీ సీటు ఆశించి భంగపడినందువల్లే కొత్తపల్లి టీడీపీని వీడారని సమాచారం. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్న తాను ప్రజాసేవ చేయాలన్న నిర్ణయంతోనే పోటీకి దిగుతున్నట్లు ఆయన నచెప్పారు. అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన తన ప్రకటన చేశారు. ఇప్పటికే […]

టీడీపీకి మరో షాక్.. స్వతంత్ర అభ్యర్థిగా కొత్తపల్లి

Edited By:

Updated on: Mar 21, 2019 | 11:16 AM

పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పార్టీలో ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీని వీడనున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నరసాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఎంపీ సీటు ఆశించి భంగపడినందువల్లే కొత్తపల్లి టీడీపీని వీడారని సమాచారం.

క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్న తాను ప్రజాసేవ చేయాలన్న నిర్ణయంతోనే పోటీకి దిగుతున్నట్లు ఆయన నచెప్పారు. అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన తన ప్రకటన చేశారు. ఇప్పటికే కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పదవికి కూడా కొత్తపల్లి రాజీనామా చేస్తారు.