AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ ఎన్నికలు, బీజేపీకి దెబ్బ ! ముగ్గురు ఎన్డీయే అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

కేరళ ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బే తగిలింది. తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముగ్గురు ఎన్డీయే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కేరళ హైకోర్టు కొట్టివేసింది.

కేరళ ఎన్నికలు,  బీజేపీకి దెబ్బ ! ముగ్గురు ఎన్డీయే అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
Kerala High Court
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 22, 2021 | 4:33 PM

Share

కేరళ ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బే తగిలింది. తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముగ్గురు ఎన్డీయే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కేరళ హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఎన్.నగరేష్ నేతృత్వంలోని  సింగిల్ బెంచ్ వీటిని కొట్టివేస్తూ..వీరు సమర్పించిన ఫారాలలో పార్టీ అధ్యక్షుని  సంతకం లేదని అంటూ వీటిని తిరస్కరించారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.హరిదాస్,  నివేదితా సుబ్రమణ్యం, అన్నా డీఎంకే అభ్యర్థి  ఆర్.ఎం.ధనలక్ష్మి  ఈ పిటిషన్లు వేశారు. వీరు వరుసగా తలసేరి, గురువాయూర్,  దేవీకులం నియోజకవర్గాల నుంచి పోటీ చేయగోరి తమ నామినేషన్లను సమర్పించారు. కాగా …ఈ నియోజకవర్గాల రిటర్నింగ్  అధికారులు తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోజాలమని కోర్టు స్పష్టం చేసింది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఇక తాము దీనిలో కలగజేసుకోలేమని వివరించింది. హరిదాస్ సమర్పించిన పత్రాల్లో పార్టీ అధ్యక్షుని సంతకం లేదని, అలాగే ఇతర అభ్యర్థుల విషయంలో కూడా  ఈ విధమైన దోషాలున్నాయని పేర్కొంది.

అటు-రిటర్నింగ్ అధికారులు సాంకేతిక కారణాలు చూపి తమ క్లయింట్ల  నామినేషన్లను తోసిపుచ్చారని  ఈ అభ్యర్థుల తరఫు లాయర్లు తెలిపారు.  వీటిలోని లో[పాలను సరిదిద్దుకోవడానికి వీరికి తగినంత సమయం ఇవ్వకుండానే హడావుడిగా వీటిని తిరస్కరించారని వారు పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలన్నది వీరి  ఉద్దేశం కాదని, అలాగే న్యాయబద్ధంగా వెళ్లాలనే వీరు కోరారని ఆ న్యాయవాదులు వాదించారు. పిరవం, కొండుట్టి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇలాగే పూర్తిగా నింపని నామినేషన్ ఫారాలను సమర్పిస్తే వాటిని సరిదిద్దుకోవడానికి వారికీ వ్యవధిని ఇచ్చ్చారని ఈ లాయర్లు పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను కోర్టు తిరస్కరించింది. ఆ సందర్భలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Ponnam Prabhakar on Suramma Project : సూరమ్మ ప్రాజెక్ట్‎కు త్వరలో సంవత్సరీకం : పొన్నం ప్రభాకర్

Corona vaccine: కరోనా కట్టడికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సరైనదే.. అమెరికాలో ఎలాంటి ఫలితాలు వచ్చాయంటే..?