Kalyan Singh: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ లక్నోలోని PGI ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేషన్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అనంతరం చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్యాణ్ సింగ్ రాజకీయ ప్రయాణం వివాదాలతో నిండి ఉంటుంది. ఇందులో బాబ్రీ మసీదు కూల్చివేత ముఖ్యమైనది. అప్పుడు రాత్రికి రాత్రే కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం పెద్ద సంచలనంగా మారింది. 90వ దశకంలో రామమందిరం ఉద్యమం ఉచ్ఛస్థితిలో ఉంది. దాని వాయిస్ దేశమంతా వినిసిస్తుంది. కల్యాణ్ సింగ్ ఈ ఉద్యమానికి రూపశిల్పి. అతడి కారణంగా ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఇందులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) పాత్ర ముఖ్యమైనది. కల్యాణ్ సింగ్ మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ మిలిటెంట్ వర్కర్.
1991లో కళ్యాణ్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. యూపీలో బీజేపీ ఇంత భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. కల్యాణ్ సింగ్ సీఎం అయ్యాడు. రామమందిరం నిర్మణం కోసం అలుపెరుగని పోరాటం చేశాడు. దీని ఫలితం1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత రూపంలో కనిపించింది. ఇది భారతదేశ రాజకీయాలపై లోతైన ముద్ర వేసిన సంఘటనగా రాజకీయ నాయకులు అభివర్ణిస్తారు. కేంద్రం నుంచి యూపీ వరకు ప్రభుత్వ మూలాలు కదిలిపోయాయి. కళ్యాణ్ సింగ్ దీనికి నైతిక బాధ్యత వహించారు. 6 డిసెంబర్ 1992 న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అతని రాజీనామా తరువాత అతని స్థాయి మరింత పెరిగింది. అతడిని ప్రధానిని చేయడానికి చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ అతను ప్రధానమంత్రి ప్రయాణాన్ని ప్రారంభించలేకపోయినప్పటికీ 1997లో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు.1999 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు.