చంద్రబాబుపై కోమటి జయరామ్ ప్రశంసలు
రాష్ట్రాన్ని అమెరికాతో సమానంగా అభివృద్ధి చేయగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరామ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిగామ వచ్చిన ఆయన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజయం కోసం ప్రచారం చేస్తున్న మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళుతున్నారన్నారు. ప్రపంచ దేశాలలో ఆయన పాలన పట్ల చర్చ సాగుతుందన్నారు. మేథస్సు, అంకితభావం గల చంద్రబాబు ఒక్కరే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు […]

రాష్ట్రాన్ని అమెరికాతో సమానంగా అభివృద్ధి చేయగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరామ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిగామ వచ్చిన ఆయన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజయం కోసం ప్రచారం చేస్తున్న మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళుతున్నారన్నారు. ప్రపంచ దేశాలలో ఆయన పాలన పట్ల చర్చ సాగుతుందన్నారు. మేథస్సు, అంకితభావం గల చంద్రబాబు ఒక్కరే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ప్రపంచంలోని తెలుగువారందరు చంద్రబాబు విజయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఆయన చొరవతోనే విదేశీ పారిశ్రామిక వేత్తలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో వచ్చిన ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రతిష్ఠాత్మకం అని తెలిపారు. ఇటువంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి చంద్రబాబు వంటి దార్శనిక ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకోవాలని జయరామ్ సూచించారు.



