సొంత నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ కూడా లేదు: జగన్
సొంత నియోజకవర్గంలో కనీసం డిగ్రీ కాలేజీ కూడా కట్టించలేకపోయారంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ అధినేత జగన్. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఏపీ సీఎంపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో 116 హామీలిచ్చి.. ఒక్కటి కూడా నెరవేర్చకుండా దుర్మార్గమైన పాలన చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. టీడీపీ.. ప్రజలను మోసం చేసి పాలన చేస్తుందన్నారు. రుణమాఫీలు చేస్తానని.. మహిళలను, రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. అదే.. వైసీపీ అధికారంలోకి […]

సొంత నియోజకవర్గంలో కనీసం డిగ్రీ కాలేజీ కూడా కట్టించలేకపోయారంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ అధినేత జగన్. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఏపీ సీఎంపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో 116 హామీలిచ్చి.. ఒక్కటి కూడా నెరవేర్చకుండా దుర్మార్గమైన పాలన చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. టీడీపీ.. ప్రజలను మోసం చేసి పాలన చేస్తుందన్నారు. రుణమాఫీలు చేస్తానని.. మహిళలను, రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. అదే.. వైసీపీ అధికారంలోకి వస్తే.. ఇళ్ల రుణాలను కూడా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు జగన్. ప్రజల సంక్షేమం కన్నా.. ఆయనకు అధికార దాహమే ఎక్కువని చంద్రబాబుపై ఆగ్రహించారు. ఎన్నికల సమయంలోనే టీడీపీకి ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. టీడీపీ మాయలో అస్సలు పడొద్దని పేర్కొన్నారు జగన్.



