పులివెందులలో జగన్‌ ఆటలు సాగనివ్వను: చంద్రబాబు

పులివెందుల: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందులలో జగన్‌ ట్యాక్స్‌ నడుస్తోందని, రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు నెలకొన్నాయని  సీఎం చంద్రబాబు ఆరోపించారు. సోమవారం కడప జిల్లా పులివెందులలో ఎన్నికల ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొన్నారు. పులివెందులలో జీఎస్టీ మాదిరిగా జేఎస్టీ (జగన్‌ ట్యాక్స్‌) ఉందని చంద్రబాబు ఆరోపించారు. వీటన్నింటినీ అరికట్టి పులివెందులను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని చంద్రబాబు అన్నారు. కష్టం రైతులది, దోపిడీ మాత్రం జగన్‌‌ది అని…ఈ ఆటలకు చరమగీతం పాడే టైం వచ్చిందని […]

పులివెందులలో జగన్‌ ఆటలు సాగనివ్వను: చంద్రబాబు

Edited By:

Updated on: Apr 02, 2019 | 1:57 PM

పులివెందుల: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందులలో జగన్‌ ట్యాక్స్‌ నడుస్తోందని, రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు నెలకొన్నాయని  సీఎం చంద్రబాబు ఆరోపించారు. సోమవారం కడప జిల్లా పులివెందులలో ఎన్నికల ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొన్నారు. పులివెందులలో జీఎస్టీ మాదిరిగా జేఎస్టీ (జగన్‌ ట్యాక్స్‌) ఉందని చంద్రబాబు ఆరోపించారు. వీటన్నింటినీ అరికట్టి పులివెందులను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని చంద్రబాబు అన్నారు. కష్టం రైతులది, దోపిడీ మాత్రం జగన్‌‌ది అని…ఈ ఆటలకు చరమగీతం పాడే టైం వచ్చిందని చెప్పారు. పులివెందుల అభివృద్ధి కోసం జగన్‌ ఎప్పుడూ మాట్లాడరని… వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు దోచుకోవడం తప్ప మరేదీ చేతకాదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతి ఎకరానికి నీళ్లిస్తానన్న చంద్రబాబు… జగన్‌కు ఎవరైనా ఓటేస్తే కేసీఆర్‌కు అధికారం ఇచ్చినట్టే అన్నారు. ప్రాణాంతకమైన యురేనియం పరిశ్రమను వైఎస్‌ తీసుకొచ్చారు… మేం మాత్రం ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలు తెస్తున్నాం అని చంద్రబాబు అన్నారు.