జనసేనలో జగన్ భజన..?

|

Jul 20, 2019 | 7:47 PM

ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం చూపుతుందని అందరూ ఊహించారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికి మాత్రమే పరిమితమయ్యింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. దీంతో జనసైనికులందరూ ఒక్కసారిగా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఓటమిని పక్కన పెట్టి.. రాజకీయాలను వీడేది లేదని.. నా ప్రాణం ఉన్నంతవరకు జనసేన […]

జనసేనలో జగన్ భజన..?
Follow us on

ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం చూపుతుందని అందరూ ఊహించారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికి మాత్రమే పరిమితమయ్యింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. దీంతో జనసైనికులందరూ ఒక్కసారిగా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఓటమిని పక్కన పెట్టి.. రాజకీయాలను వీడేది లేదని.. నా ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీ నడుస్తుందని చెప్పారు. అటు పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

ఇది ఇలా ఉండగా అసెంబ్లీలో జనసేన పార్టీ తరపున ఉన్న ఒకే ఒక్కడు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇటీవల చేసిన బడ్జెట్ ప్రసంగం ఒక్కసారిగా జనసేన పార్టీలో అలజడిని రేపుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఆయన ప్రశంసలు కురిపించారు. అంతేకాదు జగన్ ను దేవుడితో పోల్చి మరీ అందరికి షాక్ ఇచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలు జనసేన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతేకాదు వైఎస్ జగన్‌ను వైసీపీ నేతలు సైతం ఇంతలా పొగడలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనితో రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీ వీడనున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి.