‘బంగ బంధు’ షేక్ ముజిబుర్ రెహమాన్ కు గాంధీ శాంతి బహుమతి, 26 న బంగ్లాదేశ్ వెళ్లనున్న ప్రధాని మోదీ

| Edited By: Phani CH

Mar 22, 2021 | 8:22 PM

2020 సంవత్సరానికి గాను 'బంగబంధు' షేక్ ముజిబుర్  రెహమాన్ కి భారత ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేసింది...

బంగ బంధు షేక్ ముజిబుర్  రెహమాన్ కు గాంధీ శాంతి బహుమతి,  26 న బంగ్లాదేశ్ వెళ్లనున్న ప్రధాని మోదీ
India Confers Gandhi Peace Prize 2020 On Bangabandhu Sheikh Mujibur Rahman
Follow us on

2020 సంవత్సరానికి గాను ‘బంగబంధు’ షేక్ ముజిబుర్  రెహమాన్ కి భారత ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. మహాత్మా గాంధీ 125 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ శాంతి బహుమతిని ప్రదానం చేశారు.  1995 నుంచి ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తోంది. 2019 లో ఓమన్ సుల్తాన్ ఖబుస్ బిన్ సైద్ అల్ కి ప్రదానం చేశారు. బంగ్లాదేశ్  స్వాతంత్య్ర గోల్డెన్ జూబిలీ ఉత్సవాలకు, బంగ బంధు జయంతి సెలబ్రేషన్స్ కు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ  ఈనెల 26 న బంగ్లాదేశ్ వెళ్లనున్నారు. ఆ దేశ తొలి అధ్యక్షుడు, ప్రధాని కూడా అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ 1975 ఆగస్టు 15 న హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ లో  ఆయనను  ‘జాతిపిత’ అని వ్యవహరిస్తారు.  తమ దేశ  అభివృద్ధికి, వికాసానికి ఆయన ఎంతగానో సేవ చేశారు.  ఆ దేశంలో ఆయనను ‘ముజీబ్’ గా కూడా ఆప్యాయంగా పిలుస్తారు.

అహింస ద్వారా గాంధేయ  మార్గాల్లో సామాజిక,  ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారానికి కృషి చేసినవారి సేవలకు గుర్తింపుగా గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేస్తున్నారు. అటు-2019 సంవత్సరానికి ఒమాన్ సుల్తాన్ ఖబుస్ ని కూడా ఈ పురస్కారం వరించింది. గత ఏడాది జనవరిలో ఆయన కన్ను మూశారు.   ఓమన్ ను అత్యంత అధునాతన దేశంగా ఆవిర్భవింపజేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని మోదీ తన ట్విటర్ లో పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: కెనడాలోని హోటల్ వద్ద భారత జాతిపిత మహాత్మా గాంధీ ఐస్ విగ్రహం ! చూడాల్సిందే !

ISSF Shooting World Cup 2021: గురిపెడితే గెలుపు మనదే… ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో అదరగొట్టిన భారత షూటర్లు..