పాటలీపుత్ర లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థి ఆస్తుల విలువ రూ.1107 కోట్లు

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రమేష్‌కుమార్ శర్మ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన తన అఫిడవిట్‌లో ఆస్తుల విలువను రూ. 1107 కోట్లుగా పేర్కొన్నారు. శర్మ రీసైక్లింగ్ అనుబంధ వ్యాపారసంస్థను నడుపుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో రమేష్ కుమార్ శర్మకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఇక్కడ నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్, కూటమి అభ్యర్థిగా ఆర్జేడీ నుంచి బరిలోకి […]

పాటలీపుత్ర లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థి ఆస్తుల విలువ రూ.1107 కోట్లు

Edited By:

Updated on: May 15, 2019 | 6:41 PM

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రమేష్‌కుమార్ శర్మ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన తన అఫిడవిట్‌లో ఆస్తుల విలువను రూ. 1107 కోట్లుగా పేర్కొన్నారు. శర్మ రీసైక్లింగ్ అనుబంధ వ్యాపారసంస్థను నడుపుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో రమేష్ కుమార్ శర్మకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఇక్కడ నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్, కూటమి అభ్యర్థిగా ఆర్జేడీ నుంచి బరిలోకి దిగిన మిసా భారతిలకు గట్టిపోటీ ఎదురుకానుంది.