16 ఎంపీలు గెలిస్తే మరో 140 ఎంపీలు అదనంగా వస్తారు: కేటీఆర్

16 ఎంపీలు గెలిస్తే మరో 140 ఎంపీలు అదనంగా వస్తారు: కేటీఆర్

సిరిసిల్ల: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 16 ఎంపీ స్థానాలు వస్తే దానికి అదనంగా మరో 140 ఎంపీలు కలుస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీని శాశించే స్థాయికి టీఆర్ఎస్ మారాలని కేటీఆర్ అన్నారు. నేడు ఆయన సిరిసిల్ల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీ సొంత బలంతో తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ నేతలు కీలుబొమ్మల్లా మారారని విమర్శించారు. ఎన్డీయేతో కలిసి చంద్రబాబు పోలవారినికి నిధులు తెచ్చుకున్నారని, తెలంగాణలో […]

Vijay K

|

Mar 25, 2019 | 9:49 PM

సిరిసిల్ల: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 16 ఎంపీ స్థానాలు వస్తే దానికి అదనంగా మరో 140 ఎంపీలు కలుస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీని శాశించే స్థాయికి టీఆర్ఎస్ మారాలని కేటీఆర్ అన్నారు. నేడు ఆయన సిరిసిల్ల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీ సొంత బలంతో తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ నేతలు కీలుబొమ్మల్లా మారారని విమర్శించారు. ఎన్డీయేతో కలిసి చంద్రబాబు పోలవారినికి నిధులు తెచ్చుకున్నారని, తెలంగాణలో కూడా ప్రాజెక్టులు రావాలంటే 16 ఎంపీ స్థానాలు గెలవాలని చెప్పారు.

తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో చోటివ్వని మోదీకి ఎందుకు ఓటెయ్యాలి? దేశానికి కావల్సింది చౌకీదార్లు, టేకేదార్లు కాదు జిమ్మేదారు మనిషి కావాలని కేటీఆర్ అన్నారు. ఢిల్లీని శాసించే శక్తిగా టీఆర్ఎస్ మారాలని, దేశానికి కేసీఆర్‌లాంటి చేతల మనిషి కావాలని కేటీఆర్ అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu