రాష్ట్రీయ సంఘ్ పరివార్ (ఆర్ఎస్ఎస్) ని తాను ఇకపై సంఘ్ పరివార్ అని వ్యవహరించబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. సంఘ్ పరివార్ అంటే మహిళలు, గౌరవప్రదులైన పెద్దలు, మమతానురాగాలతో కూడిన కుటుంబమని, కానీ ఆర్ఎస్ఎస్ లో ఇవేవీ లేవని ఆయన చెప్పారు. యూపీలో కేరళకు చెందిన నలుగురు నన్స్ ని కొంతమంది మూక రైల్లో వేధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఒక మతాన్ని మరో మతానికి వ్యతిరేకంగా ఉసి గొల్పి, మైనారిటీలను కూడా వేధిస్తున్నారని ఆయన అన్నారు. అసలు సంఘ్ పరివార్ అంటే ఓ చక్కని కుటుంబమని, కానీ ఆర్ ఎస్ ఎస్ లో ఈ గుణాలేవీ లేవని ఆయన ట్వీట్ చేశారు.
కేరళకు చెందిన నలుగురు నన్స్ ఈ నెల 19 న ఢిల్లీ నుంచి ఒడిశా లోని తమ సొంత ప్రాంతం రూర్కెలాకు ఉత్కల్ ఎక్స్ ప్రెస్ లో వెళ్తుండగా బజరంగ్ దళ్ కు చెందినవారిగా చెబుతున్న కొంతమంది సభ్యులు, మరి కొంతమంది పోలీసులు సైతం వారిని వేధించినట్టు వార్తలు వచ్చాయి. మత మార్పిడులు చేస్తున్నారని వారిపై ఆరోపణలు మోపి వారిని బలవంతంగా రైలు నుంచి దింపివేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే తాము ఎలాంటి మత మార్పిడులకు పాల్పడలేదని వారు ఎంతగా చెప్పినా బజరంగ్ దళ్ సభ్యులు వినలేదని తెలిసింది. చివరకు కేరళ సీఎం పినరయి విజయన్ కి ఈ సమాచారం తెలిసీ ఈ ఘటన గురించి హోం మంత్రి అమిత్ షాకు లేఖ ద్వారా తెలియజేయగా ఆయన వెంటనే స్పందించి తగిన చర్య తీసుకోవలసిందిగా ఉన్నతాధికారులను , రైల్వే అధికారులను ఆదేశించారు. చివరకు ఆ నన్స్ క్షేమంగా తమ గమ్యానికి బయల్దేరి వెళ్లారు. కాగా ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని బజరంగ్ దళ్ ప్రకటించింది. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
మరిన్ని ఇక్కడ చదవండి: AP Corona Cases: ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. ఏకంగా 758 కేసులు.. పెరిగిన మరణాల సంఖ్య
CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం.. ఏప్రిల్ 6న నిధుల విడుదల