తమిళనాడు సీఎం పళనిస్వామిని డీఎంకే నేత స్టాలిన్ చెప్పుతో పోల్చిన మాజీ కేంద్ర మంత్రి

| Edited By: Phani CH

Mar 27, 2021 | 5:48 PM

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో దూషణభూషణలు, పరస్పర ఆరోపణలు శృతి మించుతున్నాయి.  డీఎంకే రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా. ...సీఎం, అన్నాడీఎంకే నేత పళనిస్వామిని .తమ పార్టీ అధినేత స్టాలిన్ చెప్పుతో పోల్చారు.

తమిళనాడు సీఎం పళనిస్వామిని డీఎంకే నేత స్టాలిన్ చెప్పుతో పోల్చిన మాజీ కేంద్ర మంత్రి
Palaniswami
Follow us on

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో దూషణభూషణలు, పరస్పర ఆరోపణలు శృతి మించుతున్నాయి.  డీఎంకే రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా. …సీఎం, అన్నాడీఎంకే నేత పళనిస్వామిని .తమ పార్టీ అధినేత స్టాలిన్ చెప్పుతో పోల్చారు.  స్టాలిన్ స్లిప్పర్ కన్నా పళనిస్వామి అధముడని అన్నారు.  నిన్న, మొన్నటివరకు ఆయన (పళనిస్వామి) బెల్లం మార్కెట్ లో పని చేసేవాడని, ఆయన స్టాలిన్ తో ఎలా పోటీకి వస్తాడని ప్రశ్నించారు. స్టాలిన్ చెప్పు విలువ నీకన్నా ఒక రూపాయి ఎక్కువే.. స్టాలిన్ తో ఎలా పోటీకి వస్తావు అని తీవ్రంగా ఆయన వ్యాఖ్యానించారు. జవహర్లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ లేదా మోదీ కన్నా దమ్ముల్లేవు గానీ తనవద్ద లూటీ చేసిన సొమ్ము ఉంది కదా అని , అదే తనను తన పార్టీని రక్షిస్తుందని భావిస్తున్నాడని ఆయన అన్నారు. ‘స్టాలిన్ ను అడ్డుకుంటానని పళనిస్వామి అంటున్నారు.. ఒక్క రోజు అలా చేసినా ఆయన కారు తన  నివాసం నుంచి ఆయన కార్యాలయం వరకు వెళ్ళదని అంటున్నా’ అని రాజా హెచ్ఛ రించారు. దీనిపై స్పందించిన పళనిస్వామి,  ఇలాంటి వ్యాఖ్యలను తాను ఎప్పటినుంచో వింటున్నానని, తను పేద రైతు కుటుంబం నుంచి వచ్చానని అన్నారు.

నేను ఎన్నో కష్టాలతో పైకి ఎదిగాను. కానీ స్టాలిన్ వెండి స్పూన్ తో పుట్టారు.. ఆయన తండ్రి కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రే. ఇక .2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో మీ పాత్ర గురించి తెలియనిదెవరికి అని ఆయన ఏ.రాజాను ఉద్దేశించి ఎత్తిపొడిచారు.  .నాడు లక్షా 76 వేల కోట్ల స్కామ్ అవినీతి వెనుక వారున్నారని, వారెంతయినా మాట్లాడుతారని పళనిస్వామి అన్నారు. ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో పోలుస్తారా  అని తీవ్రంగా ప్రశ్నించారు. తాను పేద రైతు కుటుంబంనుంచి వచ్చానని ఆయన పదేపదే చెప్పుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: పురుషుడి ప్రైవేట్ పార్ట్‌పై శాస్త్రవేత్త కామెంట్.. వ్యంగ్యంగా రియాక్ట్ అయిన బాలీవుడ్ భామ.!

Ramcharan Jani Master couple : చరణ్ బర్త్ డే సందర్భంగా సతీసమేతంగా రక్తదానం చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దంపతులు

India Post: ఇండియా పోస్టల్‌ సేవలపై ఎన్ని లక్షల ఫిర్యాదులు వచ్చాయో తెలిస్తే షాకే..