రాజకీయ ప్రచారంపై క్లారిటీ ఇచ్చేసిన హీరో నిఖిల్

హైదరాబాద్: హీరో నిఖిల్ ఈ మధ్య ఒక టీడీపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి కాస్తా వైరల్ కావడంతో కొందరు టీడీపీకి నిఖిల్ మద్దతిస్తున్నారని.. మరికొందరైతే నిఖిల్ టీడీపీలో జాయిన్ అయ్యారని కూడా కామెంట్స్ చేశారు. ఇక ఈ వార్తలన్నీ హీరో నిఖిల్ వరకు చేరడంతో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఒక వీడియో […]

  • Ravi Kiran
  • Publish Date - 2:59 pm, Sat, 6 April 19
రాజకీయ ప్రచారంపై క్లారిటీ ఇచ్చేసిన హీరో నిఖిల్

హైదరాబాద్: హీరో నిఖిల్ ఈ మధ్య ఒక టీడీపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి కాస్తా వైరల్ కావడంతో కొందరు టీడీపీకి నిఖిల్ మద్దతిస్తున్నారని.. మరికొందరైతే నిఖిల్ టీడీపీలో జాయిన్ అయ్యారని కూడా కామెంట్స్ చేశారు. ఇక ఈ వార్తలన్నీ హీరో నిఖిల్ వరకు చేరడంతో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఒక వీడియో ను పోస్ట్ చేశాడు. ఆ వీడియో ద్వారా అభిమానులకు జరిగిన అసలు విషయాన్ని వివరించాడు. ‘నాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. నేను ఏ పొలిటికల్ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. మా ఫ్యామిలీ మెంబెర్ కె.ఈ.ప్రతాప్ గారు టీడీపీ తరపున డోన్ నుంచి పోటీ చేస్తుండటంతో.. నేను ఆయన దగ్గరకు విష్ చేయడానికి వెళ్ళాను. అంతేకాకుండా అక్కడ ఉన్న స్థానిక ప్రజలను మా అంకుల్ కు ఓటు వేయమని అడగడం కూడా జరిగింది. ఆయన చాలా మంచి వ్యక్తి, నిజాయితీపరుడు. ఆ ఏరియాకు చాలా గొప్ప సేవ చేశారు. అందుకే ఆయనకు ఓటు వేయమని నేను అడిగాను. మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. నాకు తెలిసిన మంచి వ్యక్తులకు.. పార్టీలకు అతీతంగా నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను. నా వల్ల ఓట్లు పడతాయో లేదో తెలియదు గానీ ఒక భారతీయ యువకుడిగా నేను ఇది చేస్తున్నాను’ అని హీరో నిఖిల్ తెలిపారు.

సో ఇదండీ నిఖిల్ ప్రచారం వెనకున్న అసలు కథ. ఇక ఇప్పటికైనా నిఖిల్ పై వస్తున్న రూమర్స్ కు తెరపడుతుందో లేదో వేచి చూడాలి. కాగా నిఖిల్ నటించిన కొత్త చిత్రం ‘అర్జున్ సురవరం’ మే 1న రిలీజ్ కానుంది.