హుజురాబాద్ బాద్‌షా ఎవరు? ఈ ఉత్కంఠ అన్ని పార్టీలను హీటెక్కిస్తోంది. మినిట్ టు మినిట్ అప్‌డేట్ చూస్తుంటే అధికార పార్టీకి గండికొట్టినట్లుగానే కనిపిస్తోంది. అక్కడ జరుగుతున్నఅన్ని పరిస్థితులను భేరీజు వేసుకుంటున్నారు తెలంగాణ నాయకులు. వస్తున్న ఫలితాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలావుంటే.. దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీకి ఆధిక్యం దక్కింది. శాలపల్లి ఓటర్లు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాకిచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ 129 ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఈ గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 182 ఓట్లు వచ్చాయి. అయితే తాజా ఎంపీ కెప్టెన్ లక్ష్మి కాంతరావు సొంత నియోజకవర్గం.. అంతే కాదు ఆయనకు మంచి పట్టు ఉన్న తుమ్మనపల్లి, బోర్పపల్లి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు లీడ్ రావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఈటల రాజకీయ ప్రస్థానంలో ఆయన మద్దతుగా ఈ గ్రామాల ప్రజలు అండగా నిలిచారని చెప్పవచ్చు. మరోవైపు హుజురాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలోనూ ఈటల రాజేందర్ 90 ఓట్లు లీడ్ వచ్చింది. ఈ గ్రామంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సామాజిక వర్గంకు చెందిన వ్యక్తి అధికార పార్టీ గెల్లు శ్రీనివాస్‌కు అండగా నిలబడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి: Huzurabad By Election Result Live Counting: నాలుగవ రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం.. టీఆర్ఎస్‌కు ఎన్ని ఓట్లు..