AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కొనసాగుతోన్న పోలింగ్‌.. ఓటు వేసిన‌ జీహెచ్‌ఎంసీ మేయర్‌, మాజీ మేయర్

తెలంగాణ‌లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానాలకు ఉదయం 8 గంటకు పోలింగ్‌..

తెలంగాణలో కొనసాగుతోన్న పోలింగ్‌.. ఓటు వేసిన‌ జీహెచ్‌ఎంసీ మేయర్‌, మాజీ మేయర్
Ghmc Mayor Vote
K Sammaiah
|

Updated on: Mar 14, 2021 | 10:42 AM

Share

తెలంగాణ‌లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానాలకు ఉదయం 8 గంటకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్ర‌ముఖులు తమ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.

హైద‌రాబాద్‌, షేక్‌పేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇంట్లో బ‌య‌లుదేరే ముందు గ్యాస్ సిలిండ‌ర్‌కు న‌మ‌స్కారం పెట్టి వ‌చ్చి ఓటేశానని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా చెప్పారు. గ్యాస్ సిలిండ‌ర్‌, పెట్రోలు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయ‌ని ఆయ‌న ప‌రోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే తాను ఈ ఎన్నికల్లో ఓటు వేసినట్లు తెలిపారు. ప‌ట్టభ‌ద్రులంద‌రూ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయ‌న అన్నారు. ఆదివారం సెలవుదినమని ఇంట్లోనే ఉండ‌కూడ‌ద‌ని, ప్రతి ఒక్కరూ సాయంత్రం నాలుగు గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు.

ఇక హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రంలో నగర మేయర్‌ విజయలక్ష్మి, షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ ఓట్లు వేశారు. కోదాడలో ఎమ్మెల్యే మల్లయ్యాదవ్ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

అలాగే, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ అనితా రామచంద్రన్ ఓటు వేశారు. మహబూబాబాద్‌ పట్టణంలో ఎమ్మెల్యే భానోత్‌ శంకర్‌నాయక్‌ దంపతులు ఓట్లు వేశారు. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మిర్యాలగూడ పట్టణంలోని బకల్‌వాడి పాఠశాలలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

ఓల్డ్‌ మలక్‌పేటలోని అగ్రికల్చర్‌ కార్యాలయంలో హోంమంత్రి మహబూబ్‌అలీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని గర్ల్స్‌ కళాశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి – సునీత దంపతులు, వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 97 నంబర్‌ పోలింగ్ బూత్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Read More:

వరంగల్‌ జిల్లాలో ఎర్రబెల్లి విస్తృత పర్యటన. పోలింగ్‌ సరళిని అడిగి తెలుసుకుంటున్న మంత్రి

ఖమ్మం జిల్లాలో కొండా రాఘవరెడ్డి పర్యటన.. షర్మిల బహిరంగ సభ ఏర్పాట్లపై కీలక నేతలతో సమీక్ష

తెలంగాణలో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ పోలింగ్‌.. బంజారాహిల్స్‌లో ఓటు వేసిన ​మంత్రి కేటీఆర్

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే