Congress: కాంగ్రెస్​కు మరో ఎదురుదెబ్బ.. కమలదళంలో చేరిన మరో సీనియర్ నేత.. కారణం ఇదేనట..

|

May 19, 2022 | 6:12 PM

కొద్ది రోజుల క్రితం పార్టీకి గుడ్‌ బై.. గుడ్‌ లక్‌ అంటూ కామెంట్స్‌ చేసి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్‌ మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్ జాకర్‌(Sunil Jakhar) మరో ట్విస్ట్‌ ఇచ్చారు. గురువారం బీజేపీలో(Bharatiya Janata Party) చేరిపోయారు.

Congress: కాంగ్రెస్​కు మరో ఎదురుదెబ్బ.. కమలదళంలో చేరిన మరో సీనియర్ నేత.. కారణం ఇదేనట..
Sunil Jakhar
Follow us on

కాంగ్రెస్​కు( Congress ) మరో ఎదురుదెబ్బ తగిలింది. కొద్ది రోజుల క్రితం పార్టీకి గుడ్‌ బై.. గుడ్‌ లక్‌ అంటూ కామెంట్స్‌ చేసి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్‌ మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్ జాకర్‌(Sunil Jakhar) మరో ట్విస్ట్‌ ఇచ్చారు. గురువారం బీజేపీలో(Bharatiya Janata Party) చేరిపోయారు. బీజేపీ జాతీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జాకర్‌.. బీజేపీలో చేరారు. కాంగ్రెస్​ను వీడిన జాఖడ్​​.. ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్​పై విరుచుకుపడ్డారు. పార్టీ చిత్రీకరించినట్లుగా ఆయన అంత బలవంతుడేమీ కాదంటూ మండిపడ్డారు. పంజాబ్‌లో కొంతమంది కాంగ్రెస్‌ నేతలు తనపై అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించారని.. అందుకు గానూ తనపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మంచి వ్యక్తి అంటూ జాకర్‌ అనడం కొనసమెరుపు. భజనపరుల్ని దూరం పెట్టి శత్రువులెవరో, మిత్రులెవరో ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు.

కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు అంబికా సోనీపై జాఖడ్​ విమర్శలు గుప్పించారు. పంజాబ్​లో హిందూ ముఖ్యమంత్రి ఉండటం వల్ల కలిగే పరిణామాల గురించి ఆమె చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సోనీ కూడా ఓ కారణమని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తానెప్పుడు రాజకీయాలను ఉపయోగించుకోలేదన్నారు.

ఇవి కూడా చదవండి

కొందరు ఢిల్లీలో కూర్చొని పంజాబ్‌ను నాశనం చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంబికా సోనిపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా.. బుధవారం గుజరాత్‌ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ హార్ధిక్‌ పటేల్‌ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా పార్టీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.